రఫ్పాడిస్తున్న చిరంజీవి.. ఫ్యాన్స్ కు పండగే పండగ..!

NAGARJUNA NAKKA
చిరంజీవి కమ్‌ బ్యాక్‌ టైమ్‌లో చాలా ఆలోచించాడు. అభిమానులని సంతృప్తి పరిచేందుకు ఎలాంటి కథలు చేయాలా అని బోల్డన్ని పరిశోధనలు చేసి ఫైనల్‌గా తమిళ హిట్‌ 'కత్తి'ని ఖైదీ నం.150గా రీమేక్‌ చేశాడు. ఈ మూవీ వందకోట్లకి పైగా కలెక్ట్‌ చేసి చిరంజీవికి బోల్డంత ఎనర్జీ ఇచ్చింది. ఈ జోష్‌లో మరిన్ని రీమేక్‌లకి సైన్‌ చేశాడు.
చిరంజీవి ప్రస్తుతం 'ఆచార్య'తో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్‌ 29న విడుదలవుతోంది. అలాగే ఈ సినిమాతో మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో 'బోళా శంకర్‌' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తమిళ హిట్‌ 'వేదళం' రీమేక్‌గా తెరకెక్కుతోంది. బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ సెంటిమెంట్‌తో రూపొందుతోన్న ఈ మూవీలో కీర్తిసురేశ్‌ చిరుకి చెల్లెలుగా నటిస్తోంది. చిరంజీవి 150వ సినిమా కోసం ఎంత మంది దర్శకులని సంప్రదించాడో, 'గాడ్‌ఫాదర్' కోసం అంతమందిని కలిశాడు. టాలీవుడ్‌, కోలీవుడ్ ఇండస్ట్రీస్‌ని జల్లెడపట్టి ఫైనల్‌గా చెన్నై నుంచి మోహన్‌రాజాని తీసుకొచ్చాడు. ఈ సినిమాని మోహన్‌ రాజా చేతిలో పెట్టాడు. ఇక చిరు ఇన్ని జాగ్రత్తలు తీసుకుని చేస్తోన్న 'గాడ్‌ ఫాదర్' మళయాళీ హిట్‌ లూసిఫర్‌ రీమేక్‌గా రూపొందుతోంది. ఈ మూవీలో సల్మాన్‌ ఖాన్‌ స్పెషల్‌ రోల్‌ ప్లే చేస్తున్నాడు.
చిరంజీవి సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఫుల్‌స్పీడ్‌గా సినిమాలు చేస్తున్నాడు. ఒక సినిమా సెట్స్‌లో ఉండగానే రెండు మూడు కథలని ఓకే చేస్తున్నాడు. ఈ స్పీడ్‌లోనే యంగ్‌స్టర్స్‌కి ఆఫర్స్ ఇస్తున్నాడు. ఇదే ఊపులో కథల కోసం ఎదురుచూడకుండా, దర్శకులకి చిరంజీవే కథలు ఇస్తున్నాడు. పరభాషల్లో హిట్‌ అయిన కథలని తెలుగీకరిస్తున్నాడు. చిరంజీవి నెక్ట్స్‌ మరో మళయాళీ సినిమాని రీమేక్‌ చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. మోహన్‌లాల్, పృథ్వీరాజ్‌ హీరోలుగా వచ్చిన 'బ్రో డాడీ' సినిమాని రీమేక్‌ చేయాలనుకుంటున్నాడట చిరు. అయితే ఈ రీమేక్‌లో చిరంజీవి, మోహన్‌ లాల్ క్యారెక్టర్‌ చేస్తే, పృథ్వీరాజ్‌ రోల్ ఎవరు ప్లే చేస్తారు అనేది ఆసక్తి కరంగా మారింది.
ఫ్రెండ్స్‌లా ఉండే తండ్రీ కొడుకుల కథాంశంతో తెరకెక్కింది 'బ్రో డాడీ'. సో చిరంజీవికి కొడుకుగా చాలా ఫ్రెండ్లీగా కలిసిపోయి నటించే హీరో కావాలి. ఇక ఈ మూవీలో పెద్దగా మాస్‌ ఎలిమెంట్స్‌ ఉండవు కాబట్టి, రామ్ చరణ్‌ నటించే అవకాశం కనిపించట్లేదు అంటున్నారు సినీజనాలు. 'ఆచార్య'లో ఉన్నట్లు పవర్‌ఫుల్ రోల్‌ అయితే మళ్లీ తండ్రీ కొడుకులు కలిసి నటించే అవకాశం ఉండేది.. కానీ 'బ్రో డాడీ'లో కుదరకపోవొచ్చు అంటున్నారు.
చిరంజీవి సపోర్ట్‌తో మెగాఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు. వాళ్లలో నాగబాబు కొడుకు వరుణ్‌తేజ్‌ ఈ 'బ్రో డాడీ' సినిమాకి సెట్‌ అవుతాడు అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. పైగా వరుణ్‌ కూడా చిరంజీవిని డాడీ అని పిలుస్తుంటాడు, వీళ్లిద్దరి ఆఫ్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ సినిమాకి ప్లస్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది అంటున్నారు. మరి పెదనాన్న, అబ్బాయి ఇద్దరూ కలిసి 'బ్రో డాడీ' రీమేక్‌లో చేస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: