మళ్లీ పెళ్లికి సిద్ధమైన జీన్స్ హీరో.. అమ్మాయి ఎవరంటే..?
ఈ నేపద్యంలోని మరొక హీరో కూడా రెండవ సారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఆయన ఎవరో కాదు జీన్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రశాంత్. నిర్మాత త్యాగరాజన్ కొడుకుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ దొంగ దొంగ, జోడీ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. కానీ ఉన్నట్టుండి ఇండస్ట్రీకి దూరమైనా మళ్లీ రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. తెలుగులోనే కాదు కోలీవుడ్లో కూడా స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ ను సంపాదించుకున్న తర్వాత ఈయన ప్రస్తుతం అందాధున్ రీమేక్ లో కూడా నటిస్తున్నాడు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం మనకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతోంది. త్వరలోనే ప్రశాంత్ రెండవ పెళ్లి చేసుకోబోతున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు బాగా ప్రచారం అవుతున్నాయి . 2005లో వ్యాపారవేత్త కూతురు గృహలక్ష్మి తో ప్రశాంత్ తో వివాహం జరిగింది. వీరికి ఒక కొడుకు కూడా జన్మించారు. అయితే వీరిద్దరి మధ్య తరచూ మనస్పర్థలు ఎదురవుతుండడంతో పెళ్లయినా మూడు సంవత్సరాలకి ప్రశాంత్ ఆమె నుంచి విడాకులు తీసుకోవడం జరిగింది. ఇక అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న ఆయన తాజాగా మరో వివాహానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వారి కుటుంబానికి బాగా సుపరిచితురాలు అయిన ఒక అమ్మయిని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అని సమాచారం.