చిరు లెవెలే వేరబ్బా.. మాములు విషయం కాదు..!!

P.Nishanth Kumar
మెగాస్టార్ చిరంజీవి కి ఉండే స్థాయి, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన తన సినిమాల పట్ల తన కెరియర్ పట్ల ఎంతటి శ్రద్ధ అయితే వహిస్తాడో అంతే శ్రద్ధ తన చుట్టూ ఉన్న వారిపై పెడుతూ వారి ఎదుగుదలకు కూడా ఎంతో కృషి చేస్తాడు అని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఇప్పుడు టాలీవుడ్ సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కుగా మెగాస్టార్ చిరంజీవి మాత్రమే ఉన్నాడని చెప్పొచ్చు. ఇది ఇతరుల నోటి నుంచి రావడం గొప్ప విశేషం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమలోకి వచ్చి తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకర్షించి మెగాస్టార్ గా ఎదిగాడు.

వెండితెరపై ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన మెగాస్టార్ చిరంజీవి మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లి మళ్లీ సినిమాల్లోకి వచ్చి ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడు. ఆ మధ్య ఏపీ ప్రభుత్వం తో సినీరంగం ప్రముఖులు జరిపిన సంప్రదింపుల వ్యవహారంలో చిరంజీవి పోషించిన పాత్ర అంతా ఇంతా కాదు. ఆయన అక్కడ ప్రదర్శించిన ధైర్యానికి తెలివికి హుందాతనానికి ప్రతి ఒక్కరు కూడా ముగడులు అవ్వక తప్పదు. ఆ విధంగా పెద్ద పెద్ద హీరోలు సైతం ఆయనకు వీరాభిమానులు గా రాజమౌళి ఆయన గురించి ఆర్ఆర్ఆర్ సినిమా ఈవెంట్ లో పొగడడం సెన్సేషన్ అయ్యింది.

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ పలు నగరాలలో అట్టహాసంగా నిర్వహిస్తుండగా ఢిల్లీ లో జరిగిన ఈవెంట్ లో రామ్ చరణ్ ఓ సందర్భంలో నేను అమీర్ ఖాన్ కు పెద్ద అభిమానిని అని తెలియజేశారు. ఆ వెంటనే అమీర్ ఖాన్ మైక్ తీసుకొని నేను మీ నాన్న చిరంజీవి కి వీరాభిమాని అని చెప్పి మైక్ ఇచ్చారు. బహిరంగ వేదికపై చిరంజీవి కి ఓ పెద్ద స్టార్ చిరు కి పెద్ద అభిమానిని అని చెప్పడం దేశవ్యాప్తంగా మెగాస్టార్ యొక్క ఖ్యాతి ప్రబలడానికి నిదర్శనం అని చెప్పవచ్చు. ఇక మార్చి 25వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను స్థాయిలో అలరిస్తుందో చూడాలి. చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో అతిథి పాత్ర చేస్తున్న సల్మాన్ ఖాన్ తనకు ఎలాంటి పారితోషికం అవసరం లేదని చిరు పక్కన నటించడమే తనకు పెద్ద పారితోషకం అని చెప్పారట. చిరుకి అంతకన్నా గౌరవం ఇంకా ఏమి ఉంటుంది చెప్పండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: