యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ర్ఆర్ సినిమాలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా మరో హీరోగా నటించాడు. అరవింద సమేత సినిమా తర్వాత ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటించాడు, ఆర్ఆర్ఆర్ సినిమా ఈనెల 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రస్తుతం ఎన్టీఆర్ తో సహా చిత్ర బృందం లోని కొంత మంది సభ్యులు ప్రమోషన్ లో భాగంగా పలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లలో పాల్గొంటున్నారు, అలాగే ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ లలో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే, ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా తెరకెక్కి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈ రెండవ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా దాదాపు ఖరారు అయ్యింది, ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ , కొరటాల శివ సినిమా తర్వాత ఉప్పెన సినిమాతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం, మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ సినిమాను బుచ్చిబాబు సన స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా చిత్ర బృందం ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది, దీనితో ఎన్టీఆర్ ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్ లతో నటించబోతున్నట్లు తెలుస్తుంది.