బన్నీతో సినిమా చేసే ప్రసక్తే లేదు : రాజమౌళి

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్(Allu Arjun), దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుందనే టాక్‌ మీడియాలో గత రెండు రోజులుగా బాగా వినిపిస్తోంది.అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ డైరెక్షన్ లో వచ్చిన 'పుష్ప' తొలి భాగం 'పుష్ప: ది రూల్‌' గత ఏడాది థియేటర్స్‌లో మంచి విజయం సాధించింది. 'పుష్ప' పార్ట్ 2 'పుష్ప: ది రైజ్‌' సినిమా షూటింగ్‌ త్వరలోనే స్టార్ట్ కానుంది. ఇక ఈ గ్యాప్ లో ఈ ప్రాజెక్టు సెట్ చేసారని అని అంటున్నారు. ఈ విషయం విన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటున్నారు. మరో ప్రక్క రాజమౌళి ఇంకా మహేష్ కాంబినేషన్ లో సినిమా ప్రారంభం అవుతుంది అనుకుంటే ఈ ట్విస్ట్ ఏంటని మహేష్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ విషయమై అసలు నిజం ఏమిటో యస్ యస్ రాజమౌళిని మీడియావారు అడిగారు.రాజమౌళి తాజా సినిమా ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో బిజిగా ఉన్న రాజమౌళిని ఈ కాంబినేషన్ విషయమై అడగగా అవన్నీ ఒట్టి రూమర్స్ అని రాజమౌళి కొట్టిపారేసారు.తాను ఇంకా బన్ని తో సినిమా అనుకోలేదని చెప్పినట్లు సమాచారం తెలిసింది. 


అలాగే మరో ప్రక్క ఇటీవల బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీని అల్లు అర్జున్‌ కలిసొచ్చారు. దీంతో భన్సాలీ ఇంకా బన్నీ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందనే టాక్‌ బీటౌన్‌లో కూడా మొదలైంది.ఇక rrr సినిమా రిలీజ్ కోసం అందరూ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో యస్ యస్ తన తదుపరి సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ సినిమాను రాజమౌళి రిలీజ్ చేయడానికి ఎంత కాదనుకున్నా 2024 పట్టేస్తుంది. ఇక దాని తర్వాత అంటే 2024లో మొదలెట్టినా 2025లోనే వేరే హీరోతో సినిమా ఉండే ఛాన్స్ ఉంది. రాజమౌళితో అల్లు అర్జున్ సినిమా అనేది మాత్రం ప్రసక్తే లేదు అనేది వినిపిస్తున్న సమాచారం.ఎందుకంటే సూపర్ స్టార్ మహేష్ బాబు తరువాత మళ్ళీ మరోసారి ప్రభాస్ తో బాహుబలి పార్ట్ 3 మూవీ తీయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. సో బన్నీతో అయితే సినిమా వర్కౌట్ కాదనే స్పష్టంగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: