వావ్.. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్న మరో వారసుడు?

praveen
ఇటీవలి కాలంలో ఇండస్ట్రీలో సినీ ప్రముఖులు గా కొనసాగుతున్న వారి కుటుంబ సభ్యులు వారసులు హీరో గా ఎంట్రీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ఒకప్పుడు కేవలం హీరోల వారసులు మాత్రమే నటులుగా ఎంట్రీ ఇచ్చే వారు. ఇక నిర్మాతల వారసులు మళ్లీ నిర్మాతలు గానే మారే వారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం నిర్మాతలు హీరోలు హీరోయిన్లు తేడా లేకుండా అందరూ తమ వారసులని హీరోలుగా పరిచయం చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇలా ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారిలో ఇక ఇలా వారసులు గా ఎంట్రీ ఇచ్చిన హీరోలు ఎక్కువ మంది ఉన్నారు అన్న విషయం తెలిసిందే.



 ఇప్పటికే స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక మరోవైపు ప్రొడ్యూసర్ సురేష్ బాబు తనయుడు దగ్గుపాటి రానా హీరో గా ఎంట్రీ ఇచ్చి రాణిస్తూ ఉన్నాడు. ఇక ఇప్పుడు బడా సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్న డి.వి.వి.దానయ్య కుమారుడు కూడా సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనేది తెలుస్తుంది. ఎన్నో ఏళ్ల నుంచి నిర్మాతగా కొనసాగుతున్న డి.వి.వి.దానయ్య ఇటీవలి కాలంలో మాత్రం భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూ ఉన్నారు.అయితే ఇక ఇప్పుడు తన కొడుకు కళ్యాణ్ ను సినిమాల్లో హీరోగా పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారట నిర్మాత డివివి దానయ్య.



 ఇక తన వారసుడు కల్యాణ్ హీరోగా పరిచయం చేసేందుకు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒక అద్భుతమైన కథను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సినిమా మొత్తం యంగ్ టెక్నీషియన్ తో రూపొందించేందుకు కూడా ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఇప్పటికే కళ్యాణ్ నటన ఫైట్స్ డాన్స్ తదితర అంశాల్లో శిక్షణ తీసుకున్నాడు. ఇకపోతే లుక్స్ పరంగా బాగానే ఉన్నా డివివి దానయ్య వారసుడు కళ్యాణ్... సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎలా రాణిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇకపోతే డివివి దానయ్య నిర్మించిన త్రిబుల్ ఆర్ సినిమా మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతుంది అనే విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: