ప్రతి సంవత్సరం సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు, అలా సినిమా ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇస్తే ముద్దుగుమ్మ లలో కొంత మంది మొదటి సినిమా తోనే మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ అందుకోక పోయినప్పటికీ తన అందంతో, నటనతో ప్రేక్షకులను అలరించి ఆ తర్వాత మంచి సినిమా అవకాశాలను దక్కించుకుంటు ఉంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన మొదటి సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ మొదటి సినిమాలో తన అందంతో , నటనతో ప్రేక్షకులను అలరించే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంటున్న హీరోయిన్ లలో శ్రీ లీల ఒకరు. అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల 'పెళ్లి సందD' మూవీ తో హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది, రోషన్ హీరోగా తెరకెక్కిన పెళ్లిసందD ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికీ ఈ సినిమాలో శ్రీ లీల అందచందాలకు, నటనకు మాత్రం టాలీవుడ్ ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కడంతో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రీ లీల కు క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతున్నాయి.
అందులో భాగంగా ఇప్పటికే శ్రీ లీల , మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ధమాకా మూవీబ్లో హీరోయిన్ గా నటిస్తుంది, ధమాకా మూవీ తో పాటు శ్రీ లీల , వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా నవీన్ పోలిశెట్టి తో ఓ సినిమా చేసేందుకు సైన్ చేసిందట. అలాగే మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ లోను శ్రీ లీల సెకెండ్ హీరోయిన్ గా నటించనుందనే టాక్ ఉంది, వీటితో పాటు నితిన్ , వక్కంతం వంశీ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న జూనియర్ సినిమాలో కూడా శ్రీ లీల ను హీరోయిన్ గా చిత్ర బృందం ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.