దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్, మూవీ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలు గా నటించారు, రాజమౌళి 'బాహుబలి' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఆర్ఆర్ఆర్ సినిమాపై దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా ఉన్నాయి. అలా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు కలిగి ఉన్నా ఈ సినిమా మార్చి 25 వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది, ఈ సందర్భంగా కర్ణాటకలోని చిక్‌బళ్లాపుర్ వేదికగా 'ఆర్ఆర్ఆర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది, ఇక ఈ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో భాగంగా దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ... మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసిన ఈ వేదిక మైత్రీ సంగమం లాంటిదని దర్శకుడు రాజమౌళి అభివర్ణించాడు, నందమూరి అభిమానులను అరేబియా మహాసముద్రంతో పోల్చాడు రాజమౌళి. ఇదంతా చూస్తుంటే నాకు శ్రీ కృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యం ఇలాగే ఉండేదేమో అనిపిస్తుంది అని రాజమౌళి అన్నారు, ఈ మైత్రీ బందం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను అని దర్శకుడు రాజమౌళి అన్నారు.
ఇక తనకు ఫ్యామిలీ మెంబర్స్ కంటే తన అసిస్టెంట్ డైరెక్టర్‌లే ఎక్కువ అని ఈ సందర్భంగా రాజమౌళి స్పష్టం చేశారు, వాళ్లు లేకుంటే నేను ఈ మూవీ ఇంత బాగా చేయలేనన్నాడు. ఈ వేదికపై వారికి పేరుపేరునా రాజమౌళి కృతజ్ఞతలు తెలియజేశాడు, ఇది ఇలా ఉంటే త్వరలోనే మరో 'ఆర్ఆర్ఆర్' మూవీ కూడా ఉందని రాజమౌళి అన్నారు. అయితే అందులో హీరోల కంటే ముందే అసిస్టెంట్ డైరెక్టర్లు నటించి చూపిస్తారు అని రాజమౌళి అన్నారు, ఇక ఈ 'ఆర్ఆర్ఆర్' విడుదలయ్యాక ఆ మూవీ విడుదల చేస్తామన్నాడు, అయితే అసిస్టెంట్ డైరెక్టర్లు నటించిన 'ఆర్ఆర్ఆర్' కు మించిన కామెడీ మూవీ ఉండదు అని ఈ సందర్భంగా రాజమౌళి తెలియజేశారు.