రాజమౌళి తన సినిమాలను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దాడు అనే విషయం మనకు తెలిసిందే. ఆయన తన ప్రతి సినిమాను కూడా ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తాడు. ఒక శిల్పి శిల్పం ఎంత బాగా చేక్కుతాడో అంత బాగా రాజమౌళి తన సినిమాలను తెరకెక్కిస్తాడు. అందుకే ఆయనకు జక్కన్న అనే పేరు వచ్చింది. తన మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతో భారీ స్థాయిలో తెరకెక్కించి ప్రేక్షకులను అలరించాడు జక్కన్న. అందుకే ఆయనకు అతి తక్కువ కాలంలోనే భారీ సినిమాల దర్శకుడిగా బిరుదు వచ్చింది. ఈ నేపథ్యంలో రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ విడుదల చేయడానికి రంగం సిద్దం చేస్తున్నాడు.
మార్చి 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతుంది. ఈ సినిమా ద్వారా ఆయన ఓ సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు పంచ పోతున్నాడు ఇప్పటివరకు సోలో హీరో సినిమాలో చేసిన రాజమౌళి ఈ చిత్రంతో ఇద్దరు భారీ స్థాయి హీరోలను కలిగిన సినిమా చేస్తున్నారు. ఆ విధంగా ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ సినిమా జనవరిలో విడుదల కావాల్సి ఉంది. ఆ సమయంలోనే భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు చిత్రబృందం. కానీ అనూహ్యంగా అది వాయిదా పడింది.
ఇప్పుడు మార్చి 25 వ తేదిన విడుదల చేయడానికి సిద్ధం కావడంతో ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్రబృందం జోరుగా పాల్గొంటోంది. ఎలాగైనా ఈ సినిమా భారీ విజయం దక్కేలా చేయాలని భావిస్తోంది. అయితే మునుపటిలా ఈసారి రాజమౌళి తనదైన స్టైల్ లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడం లేదని కొంతమంది నుంచి వస్తున్న అభిప్రాయం వాస్తవానికి ఏదైనా ఒక పెద్ద సినిమా విడుదల వాయిదా పడడం అది కూడా విడుదలకు రెండు మూడు రోజుల ముందు వాయిదా పడటం అనేది వారిలో ఎంతో నిరుత్సాహాన్ని కలగజేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర బృందం ఇప్పుడు ఈ చిత్రాన్ని ఎంతటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.