ప్రస్తుతం ప్రేక్షకులు 'ఓ టి టి' లకు ఏ రేంజ్ లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో మన అందరికీ తెలిసిందే, ఒకప్పుడు సినిమాను కుటుంబం అంతా కలిసి థియేటర్ లలో చూడడానికి ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేవారు. కానీ ప్రస్తుతం చాలా మంది ప్రేక్షకులు సినిమాలను కుటుంబంతో కలిసి 'ఓ టి టి' లలో చూడడానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారు, అలా సినిమాను ధియేటర్ లలో కాకుండా 'ఓ టి టి' లో చూడడానికి ఎక్కువ శాతం మంది ప్రేక్షకులు ప్రాముఖ్యత ఇవ్వడానికి ప్రధాన కారణం ప్రస్తుతం ఉన్న కారోనా పరిస్థితులే అని చెప్పవచ్చు. ఇలాంటి కారోనా పరిస్థితులలో కుటుంబ మంతా కలిసి బయటికి వెళ్లి థియేటర్ లలో సినిమా చేసి కరోనా బారిన పడటం కంటే, ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా కుటుంబ మంతా 'ఓ టి టి' లో సినిమా మంచిది అని కొంత మంది ప్రేక్షకులు భావిస్తూ ఉండడంతో 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది.
అందులో భాగంగా కొన్ని సినిమాలు థియేటర్ లలో పెద్దగా రాణించక పోయినప్పటికీ 'ఓ టి టి' లో మాత్రం సక్సెస్ అవుతున్నాయి, అలా థియేటర్ ల వద్ద పర్వాలేదు అనే టాక్ ను సంపాదించుకొని తాజాగా 'ఓ టి టి' లో విడుదలై ఫుల్ స్పీడ్ దూసుకుపోతున్న సినిమాలో రౌడీ బాయ్స్ మూవీ ఒకటి, ఆశిష్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా శ్రీ హర్ష కొనగంటి దర్శకత్వంలో తెరకెక్కిన రౌడీ బాయ్స్ సినిమా థియేటర్ ల వద్ద పర్వాలేదు అనే టాక్ ను సొంతం చేసుకుంది. కొన్ని రోజుల క్రితమే 'ఓ టి టి' లో విడుదల ఈ సినిమా అతి తక్కువ కాలంలోనే 10 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను సాధించింది, ఇలా రౌడీ బాయ్స్ సినిమా 'ఓ టి టి' లో దూసుకుపోతుంది.