సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశు రామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మహానటి కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను కూడా చిత్ర బృందం విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఉన్న అంచనాలు కూడా అమాంతం పెంచేశాయి, ఇది ఇలా ఉంటే సర్కారు వారి పాట సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూర్చాడు.
ఈ మూవీ నుండి ఇప్పటికే కళావతి అనే సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది, కళావతి సాంగ్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సాంగ్ యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ ను సాధిస్తూ ఇప్పటికి కూడా ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ఇది ఇలా ఉంటే సర్కారు వారి పాట సినిమా నుండి మార్చి 20 వ తేదీన రెండో సాంగ్ విడుదల చేయబోతున్నట్లు కొన్ని రోజుల క్రితమే చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది, ఇది ఇలా ఉంటే తాజాగా సర్కార్ సినిమా నుండి విడుదల కాబోయే రెండు లిరికల్ వీడియో సాంగ్ గురించి తమన్ సోషల్ మీడియా వేదికగా చాలా ఎగ్జైట్మెంట్ గా ఒక వీడియో ను పోస్ట్ చేశాడు. ప్రతి ఒక్కరికీ సాంగ్ సూపర్‌గా నచ్చుతుంది'.. అంటూ తమన్ సర్కారు వారి పాట' సినిమా నుంచి రాబోతున్న సెకండ్ సాంగ్ గురించి తాజాగా సోషల్ మీడియాలో ఎగ్జైటింగ్‌గా వాయిస్ మెసేజ్ ఇచ్చారు, దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత మహేశ్ , తమన్ కాంబినేషన్ ఇప్పుడు రిపీటవుతోంది, ఇది ఇలా ఉంటే మార్చి 20 వ తేదీన సర్కారు వారి పాట మూవీ నుండి పెన్నీ సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేయబోతున్నారు, మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.