'కేజీఎఫ్2' నుండి బిగ్ అప్డేట్.. తుఫాన్ కి సమయం ఆసన్నమైంది..!

Anilkumar
దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో కే జి ఎఫ్ 2 కూడా ఒకటి. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో యశ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆయన అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కే జి ఎఫ్ చాప్టర్ 1 కన్నడ తో పాటు అన్ని భాషల విడుదలై సంచలన విజయాన్ని అందుకోవడంతో.. ఇప్పుడు  కే జి ఎఫ్ చాప్టర్2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే కే జి ఎఫ్ 2 నుంచి విడుదలైన పోస్టర్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు పలు రికార్డులు కూడా సృష్టించింది. 

ముఖ్యంగా ఈ సినిమా టీజర్ అయితే యూట్యూబ్ లో 250 మిలియన్ లకు పైగా వ్యూస్ సాధించి సౌత్ లోనే సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇక అభిమానులు, ప్రేక్షకులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న కెజిఎఫ్ 2 సరి కొత్త అప్డేట్ ని తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇటీవల ఈ చిత్ర టీం సినిమా నుంచి ట్రైలర్ కావాలా? సాంగ్ కావాలా? అంటూ అడగగా.. అందరూ సాంగ్ కావాలి అనేసరికి ప్రేక్షకుల కోరిక మేరకు ఈ సినిమాలోని మొదటి పాటను విడుదల చేయనున్నట్లు తెలిపారు. తుఫాన్ అంటూ సాగే ఈ పాటను మార్చి 21 న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అంతేకాకుండా ఒక సరికొత్త పోస్ట్ ని కూడా విడుదల చేశారు.

ఈ పోస్టర్ లో చిన్నపిల్లలను చూపించారు  కే జి ఎఫ్ చాప్టర్ 1 లో చిన్నపిల్లల కాపాడేందుకు వచ్చినవాడే రాఖీ భాయ్. ఇక ఏప్రిల్ 14న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సినిమాలో యశ్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.మ్ బాలీవుడ్ అగ్ర నటుడు సంజయ్ దత్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రకాష్రాజ్, రవీనాటాండన్, ఈశ్వరీ రావు, రావు రమేష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. హోమ్ బలే ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్ కిరందుర్ ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: