డార్లింగ్ ఫ్యాన్స్ : ఆ మూవీకి హ్యాపీగా .... తడిగుడ్డ వేసుకుని పడుకోవచ్చట .... ??
ప్రభాస్ పామిస్ట్ విక్రమాదిత్యగా కనిపించిన ఈ సినిమాలో ప్రేరణ అనే పాత్రలో నటించారు పూజా హెగ్డే. పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రంగా రొమాంటిక్, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రాధేశ్యామ్ మూవీ చూసిన చాలా మంది ప్రేక్షకులు పెదవి విరిచారు. బాహుబలి స్టార్ ప్రభాస్ ని హీరోగా పెట్టుకుని సినిమాలో ఏ మాత్రం కమర్షియల్ అంశాలు పెట్టకపోవడంతో పాటు సినిమాలో చాలా చోట్ల ల్యాగ్స్ ఉన్నాయని, అలానే పలు సందర్భాల్లో కథని సాగదీశారనే వాదనలు కూడా వినిపించాయి. ఆ విధంగా ప్రస్తుతం పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు కలెక్షన్స్ తో ముందుకు నడుస్తోంది రాధేశ్యామ్ మూవీ. అయితే దీనితో పాటు ప్రస్తుతం ప్రభాస్ మరొక మూడు భారీ పాన్ ఇండియా సినిమాలు కూడా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అతి త్వరలో యువ దర్శకుడు మారుతీ తో ఒక లో బడ్జెట్ సినిమా కూడా ప్రభాస్ చేయనున్నట్లు సమాచారం.
రాజాడీలక్స్ అనే టైటిల్ తో పూర్తి స్థాయి కామెడీ యాక్షన్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమా ఏప్రిల్ రెండవ వారంలో ప్రారంభం కానుండగా కేవలం ఆరు నెలల వ్యవధిలో వేగవంతంగా మారుతీ దీనిని పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయనున్నారని టాక్. అలానే ఈ సినిమాలో ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు పక్కాగా ఉండేలా మారుతీ స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నారని, తప్పకుండా ఈ మూవీ అందరినీ ఎంతో ఆకట్టుకోవడం ఖాయం అని అంటున్నారు. మొత్తంగా రాజాడీలక్స్ మూవీ విషయమై హ్యాపీగా ప్రభాస్ ఫ్యాన్స్ నెత్తిన తడి గుడ్డ వేసుకుని పడుకోవచ్చనేది అర్ధం అవుతోందని అంటున్నారు విశ్లేషకులు.