రాథే శ్యామ్ తో ఆర్ ఆర్ ఆర్ లో పెరుగుతున్న గుబులు !

Seetha Sailaja
టాప్ హీరోల సినిమాలు హిట్ అవ్వడం అదేవిధంగా ఫ్లాప్ అవ్వడం సాధారణ విషయం. అయితే అత్యంత భారీ అంచనాలతో విడుదలైన ‘రాథే శ్యామ్’ ను ఈమధ్య కాలంలో విడుదలైన ఇండియన్ బాక్సాఫీస్ సూపర్ ఫ్లాప్ గా ఇండస్ట్రీ వర్గాలు పరిగణిస్తున్నాయి. ఈసినిమాకు విడుదలకు ముందు వచ్చిన క్రేజ్ కు తగ్గట్టుగా కనీసం ఈమూవీ ఓపెనింగ్ కలక్షన్స్ కూడ రాకపోవడం ఇండస్ట్రీకి షాక్ ఇస్తోంది.

దీనితో మరో వారం రోజులలో విడుదల కాబోతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ టీమ్ లో బయటకు చెప్పుకోలేని గుబులు ఏర్పడిందని ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల అంచనాల ప్రకారం ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి ఏర్పడిన మ్యానియా రీత్యా ఆమూవీ సూపర్ బ్లాక్ బష్టర్ హిట్ గా కానీ లేదంటే ఫ్లాప్ గా కానీ మారే ఆస్కారం ఉంది కానీ ఈమూవీకి మోడరేట్ రిజల్ట్ అన్న అవకాశమే లేదు అన్నమాటలు వినిపిస్తున్నాయి.


ఈవిషయాలను దృష్టిలో పెట్టుకుని రాజమౌళి ఈమూవీ ప్రమోషన్ లో ఇప్పటికే ‘ఆర్ ఆర్ ఆర్’ 50 శాతం విజయం సాధించింది అంటూ తన ప్రచారాన్ని ఊదరకోడుతున్నారు. ఈసినిమాకు జరిగిన భారీ బిజినెస్ ను దృష్టిలో పెట్టుకుంటే ఈమూవీని ప్రేక్షకులు ఒక్కసారి ధియేటర్ల లో చూస్తే సరిపోదని రిపీటేడ్ గా ‘బాహుబలి’ రేంజ్ లో ఒకటికి రెండు సార్లు ధియేటర్లకు వచ్చి చూసినప్పుడు మాత్రమే భారీ స్థాయిలో భారీ మొత్తాలకు ఈమూవీని కొనుకున్న బయ్యర్లు లాభాల బాట పట్టే ఆస్కారం ఉందని విశ్లేషణలు వస్తున్నాయి.

దీనికితోడు ఈ మూవీ చరణ్ జూనియర్ లు నటించిన మల్టీ స్టారర్ కాబట్టి చరణ్ జూనియర్ అభిమానులకు ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో ఎలాంటి అసంతృప్తి లేకుండా ఉండితీరాలని తమ హీరోల వ్యక్తిగత ఎలివేషన్ లో ఏమాత్రం తేడా వచ్చినా చరణ్ జూనియర్ అభిమానులలో వచ్చే అసంతృప్తి ఈమూవీ ఫలితం పై తీవ్ర ప్రభావం పడే ఆస్కారం ఉంది అన్న కామెంట్స్ ఉన్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

RRR

సంబంధిత వార్తలు: