ఘోస్ట్ చిత్రం నుంచి త్వరలోనే బిగ్ అప్డేట్..!!

Divya
నాగార్జున ఇటీవల బంగార్రాజు సినిమాతో మంచి సక్సెస్ ను అందుకొని జోరుమీద ఉన్నాడు అని చెప్పవచ్చు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే .కానీ ఇటీవల చిత్రబృందంకి కరోనా పాజిటివ్ రావడంతో దుబాయిలో షెడ్యూల్ కాస్త వాయిదా వేసినట్లు సమాచారం . దుబాయ్ తొలి షెడ్యూల్ మొదలు కానుండగా ఇలా మొదటిసారే కరోనా సోకడంతో షూటింగ్ పనులు కాస్త ఆగిపోయాయి. దీంతో చిత్రబృందం అందరూ షూటింగ్ లేక ఖాళీగా ఉండటంతో దుబాయిలో వెకేషన్ ప్లాన్ చేశారు. ఈ సినిమాలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్.. అనిఖా సురేంద్రన్.. గుల్ పనాగ్ వంటి వారు హీరోయిన్లు గా నటిస్తున్నారు.

ఇలాంటి ఫాంటసి థ్రిల్లర్  మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున కు సంబంధించి ఒక పోస్టర్ ను విడుదల చేయగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. జోరువానలో నాగార్జున కత్తి పట్టుకుని అవుట్ అండ్ అవుట్ యాక్షన్ లుక్ లో చాలా అద్భుతంగా కనిపించాడు. ఇకపోతే తాజాగా దుబాయ్ లో నాగార్జున -  సోనాల్ చౌహన్ మధ్య హాట్ సాంగ్ ను చిత్రీకరిస్తామని ఇప్పటికే అధికారికంగా చిత్రం యూనిట్ ప్రకటించింది. బ్లూ సీ లో ఈ పాటను అద్భుతంగా చాలా రొమాంటిక్ గా  తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.. చూస్తుంటే సూపర్ సినిమాలో తెరకెక్కించిన సూపర్ హాట్ సినిమాకు ఏమాత్రం తీసిపోకుండా ప్రవీణ్ సత్తార్ చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గుంటూరోడు సినిమాలో శ్రద్దాదాస్ చేసిన అందాల విందు కంటే మరింత హీట్ పుట్టించేలా సోనాల్ చౌహన్ పూర్తి స్థాయిలో చాలా హాట్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే దుబాయ్ సాంగ్ తీయటర్ లలో హిట్ పుట్టిస్తుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ముందు ఈ సినిమా నుంచి ఎలాంటి క్రేజీ అప్ డేట్ లు వస్తాయో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: