ఆ మ్యూజిక్ డైరెక్టర్ పై కన్నేసిన 'ఆర్ ఆర్ ఆర్' హీరోలు..?

Anilkumar
థమన్ ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలకు బెస్ట్ ఆప్షన్‌గా మారడం జరిగింది. అయితే ఆయన స్వరపరచిన సంగీతానికి మంచి రెస్పాన్స్ వస్తుంది.కాగా  థమన్ సారధ్యంలో రూపొందిన ప్రతి పాటకు సంగీత ప్రియులు మైమరచిపోతున్నారు.తాజాగా  ఇప్పుడు థమన్‌కి పోటీగా తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మారనున్నారా అంటే అవునని అనిపిస్తుంది.ఇకపోతే  ప్రస్తుతం ఆయన ఖాతాలో చాలా తెలుగు సినిమాలు ఉన్నాయి.అయితే స్టార్ కంపోజర్ అనిరుధ్, అడపాదడపా తెలుగులో సినిమాలు చేస్తూనే ఉన్నాడు.  కోలీవుడ్ లో ఇస్తున్నంత సౌండ్, టాలీవుడ్ లో ఇవ్వలేకపోతున్నాడు. ఇకపోతే తమిళ్ లో అతడి పాటలు సూపర్ డూపర్ హిట్టవుతున్నాయి. 

ఇక యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు మరోసారి టాలీవుడ్ లో ఓ సినిమాకు సంగీతం అందించే అవకాశం అందుకున్నాడు అనిరుధ్.ఇకపోతే త్వరలోనే శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. అయితే ఈ సినిమాకు అనిరుధ్ ను సంగీత దర్శకుడిగా తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇక ఇంతకుముందు తమన్, గోపీసుందర్ తో వర్క్ చేసిన శివనిర్వాణ, ఈసారి అనిరుధ్ కోసం ట్రై చేస్తున్నాడు.ఇకపోతే అజ్ఞాతవాసి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అనిరుధ్.ఇక ఆ తర్వాత గ్యాంగ్ లీడర్, జెర్సీ లాంటి సినిమాలకు పనిచేసినప్పటికీ, చార్ట్ బస్టర్స్ అందించలేకపోయాడు.

అయితే  ఆ తర్వాత పూర్తిగా కోలీవుడ్ కే పరిమితమైన అనిరుధ్, తాజాగా విజయ్ హీరోగా నటిస్తున్న బీస్ట్ సినిమాకు సూపర్ ఆల్బమ్ అందించాడు. ఇకపోతే దీంతో అతడికి మరోసారి టాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి.ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం  ఏకంగా ఆర్ఆర్ఆర్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ సినిమాలకు అనిరుధ్‌ని మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ 30వ సినిమా కోసం ఇప్పటికే అనిరుధ్ ని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. అయితే  ఆర్‌సీ 16 కోసం కూడా అనిరుధ్‌ని ఎంపిక చేసారని టాక్.ఇకపోతే  ఈ రెండు సినిమాలతో మనోడి క్రేజ్ ఓ రేంజ్‌కి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: