మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'మహానటి' సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుంది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సావిత్రి గారి పాత్రలో కీర్తిసురేష్ అద్భుతమైన నటనను కనబర్చింది. అప్పటివరకు అంతంతమాత్రంగానే గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్.. ఈ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అంతేకాదు ఈ సినిమా తర్వాత నుండి ఆమెను అందరూ మహానటి కీర్తి సురేష్ అని పిలవడం మొదలు పెట్టారు. అంతలా సావిత్రి గారి పాత్రలో లీనమైపోయింది కీర్తి సురేష్. అయితే ఈ పాత్ర ముందుగా సమంత కు వరించగా.. ఆమె అంతటి అద్భుతమైన పాత్రలో నేను చేయలేను అని చెప్పి సినిమాలో జర్నలిస్ట్ పాత్ర చేసింది సమంత.
ఆమె సరసన విజయ్ దేవరకొండ నటించిన విషయం తెలిసిందే.ఇక సావిత్రి భర్త సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ సినిమాలో నటించలేక పోయారు. అయితే అందుకు సంబంధించిన కారణాలు ఏంటనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన నాగ్ అశ్విన్ ఆ తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అయితే ఆ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత మహానటి సినిమాకి దర్శకత్వం వహించి దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నాడు.
ఇక సినిమాలో అక్కినేని నాగేశ్వర పాత్రలో నాగచైతన్య నటించగా.. సీనియర్ ఎన్టీఆర్ గారి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించలేదు. అయితే దీనిపై ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు నాగ్ అశ్విన్. 'మహానటి సినిమా కోసం ఎన్టీఆర్ పాత్ర కోసం తనతో పాటు స్వప్న దత్ కూడా జూనియర్ ఎన్టీఆర్ ను సంప్రదించారని చెప్పారు. ఎన్టీఆర్ ఒప్పుకొని ఉంటే సినిమాలో ఎక్కువగా ఎన్టీ రామారావు, సావిత్రి మధ్య సన్నివేశాలు ఉండేవని చెప్పారు. కానీ అప్పటికే ఎన్టీఆర్ కొన్ని సినిమా షూటింగులతో బిజీ కావడం కారణంగా ఆయన సినిమాలో చేయడానికి ఒప్పుకోలేదు' అంటూ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు దర్శకుడు నాగ్ అశ్విన్...!!