RRR కు గుడ్ న్యూస్... ఫ్యాన్స్ ఇక తగ్గేదేలే?

frame RRR కు గుడ్ న్యూస్... ఫ్యాన్స్ ఇక తగ్గేదేలే?

VAMSI
లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చేందుకు ఆర్ ఆర్ ఆర్ మూవీ రెడీ అయిపోతుంది. అన్ని హంగులను దిద్దుకుని ప్రేక్షకుల నిరీక్షణకు తియ్యటి వీడ్కోలు చెప్పేందుకు రిలీజ్ కు ప్లానింగ్ జరుపుతోంది. ఇంతలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "ఆర్ ఆర్ ఆర్" టీం కు గుడ్ న్యూస్ చెప్పడం విశేషం. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ అయిన రణం రౌద్రం రుధిరం మల్టీ స్టారర్ చిత్రానికి మరో గుడ్ న్యూస్ అందింది. ఏపిలో ప్రీమియం షో అడిషనల్ గా వినియోగించుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు రాజమౌళి మీడియా ముఖంగా తెలియచేస్తూ సంతోషాన్ని పంచుకున్నారు.

తెలంగాణలో ఇప్పటికే ప్రీమియర్ షో కు పర్మిషన్ దక్కగా ఇటు ఆంధ్ర రాష్ట్రం లోనూ ప్రీమియర్ షోకు అనుమతి లభించడం నిజంగా శుభవార్తే అంటూ ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఇకపై తెలుగు రాష్ట్రాల్లో పలు సినిమాలు తొలి రోజు 5 షోల తో రన్ కానున్నాయి. ఇది సినీ పరిశ్రమకు నిజంగా చాలా పెద్ద శుభవార్తే. ఎందుకంటే సినిమా ఫలితాలు తదుపరి మాట ముఖ్యంగా మొదటి రోజు మాత్రం ప్రేక్షక అభిమానులు తమ అభిమాన తారల సినిమాలు చూడటానికి క్యూలు కడుతారు, పడిగాపులు కాస్తారు. కానీ టికెట్ల దొరక్క చాలా మంది నిరాశ చెందాల్సి ఉంటుంది. అయితే ఇకపై మరో షో కు పర్మిషన్ రావడంతో ఇంకొందరు ప్రేక్షక మహాశయులకు తమ ఫేవరెట్ హీరోల సినిమాలు మొదటి రోజు చూసే అవకాశం లభించనుంది.

ఇటు ఇంకో షో యాడ్ అవడంతో ఆ చిత్రాలకు కలెక్షన్లు కూడా భారీగానే పెరుగుతాయి. ఇలా ఇది అన్ని రకాలుగా అందరూ సంతోషించాల్సిన విషయం. అదే విధంగా ఏపిలో టికెట్ రేట్లను మరో రూ.100 అదనంగా పెంచుకునేందుకు సైతం ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది అని సమాచారం. ఇలా అన్ని విధాలుగా ఆర్ ఆర్ ఆర్ సినిమాకి గ్రాండ్ గా రంగం సిద్ధం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: