మాచర్ల నియోజకవర్గం ఫస్ట్ లుక్, టీజర్ త్వరలో రాబోతుంది...నితిన్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  నితిన్ ,  వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన భీష్మ సినిమాతో  మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర  అందుకున్నాడు,   రష్మిక మందన హీరోయిన్ గా నటించిన భీష్మ సినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది, అయితే ఆ తర్వాత నితిన్ నటించిన చెక్, రంగ్ దే  సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బోల్తా పడ్డాయి, కానీ చెక్ , రంగ్ డే సినిమాల తర్వాత నితిన్ నటించిన మాస్ట్రో సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా థియేటర్ లలో కాకుండా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి'  లో విడుదలయింది. 
ఇది ఇలా  ఉంటే ప్రస్తుతం నితిన్ మాచర్ల నియోజకవర్గం మూవీలో హీరోగా నటిస్తున్నాడు,   ఈ మూవీ లో నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది,  ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ తో  ప్రముఖ ఎడిటర్ ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.  

ఈ మూవీ ని ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి శ్రేష్ట్ మూవీస్‌ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు,  మాచర్ల నియోజకవర్గం మూవీ భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.  అనల్ అరసు మాస్టర్ పర్యవేక్షణ లో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ ను తెరకెక్కించారు,  అలాగే ఆ తర్వాత జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన మాస్ డ్యాన్స్ పూర్తయింది.  మాచర్ల నియోజకవర్గం మూవీ ఫస్ట్ లుక్, టీజర్ వివరాలు త్వరలో రాబోతున్నాయి అని నితిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ చేసాడు, ఈ సినిమాలో కృతి శెట్టి తో పాటు కేథరిన్ థెరిస్సా కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: