హాట్ టాపిక్ గా మారిన బండ్ల గణేష్ కామెంట్స్
2018లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే బ్లేడ్ తో గొంతు కోసుకుంటానని ప్రకటించి ఆతరువాత ఏదో సంచనాలానికి అన్నాని అంటూ మాట మార్చాడు. ఈమధ్య జరిగిన ‘బీమ్లా నాయక్’ ఫంక్షన్ లో మాట్లాడాలని ఎంతో ప్రయత్నించినా ప్రయత్నాలు ఫలించలేదు. అయితే అవకాశం వచ్చినప్పుడల్లా పవన్ కల్యాణ్ పై మాత్రం అభిమానాన్ని ప్రదర్శించడంలో ఎప్పుడూ వెనుక అడుగు వేయడు.
ఈనేపధ్యంలో ఈరోజు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జరగబోతున్న ‘జనసేన’ ఆవిర్భావ సభ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సభను విజయవంతం చేసేందుకు జనసైనికులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. 'వీరులారా ధీరులారా జనసేన సైనికులారా రండి కదలిరండి కడలి అలలా తరలి రండి. నేను కూడా వస్తున్నాను. మన దేవర నిజాయతీకి సాక్షిగా నిలబడడం కోసం తెలుగు వాణి వాడి వేడి నాడి వినిపించడం కోసం అమరావతి నించి హస్తిన దాకా అలజడి పుట్టించడం కోసం కలుద్దాం. కలిసి పోరాడదాం' అంటూ బండ్ల గణేష్ ఇచ్చిన పిలుపు కు జన సైనికులు మాత్రమే కాకుండా సాధారణ జనం ఎన్ని వేలమంది వస్తారో చూడాలి. ఈరోజు పవన్ చేయబోయే ఉపన్యాసంలో రాజకీయాలతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన సినిమా టిక్కెట్ల రేట్ల విషయం పై కూడ కొన్ని ఆవేశపూరితమైన కామెంట్స్ ఉంటాయని అంచనాలు ఉన్నాయి..