వావ్: తాప్సీ సినిమా.. ట్రైలర్ విడుదలకు ఇద్దరు స్టార్ హీరోల..!

Divya
చిరంజీవి తో రామ్ చరణ్ ఆచార్య సినిమా ని నిర్మించిన బ్యానర్..మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తాజాగా నిర్మించిన చిత్రం "మిషన్ ఇంపాజిబుల్"ఈ సినిమాకి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ డైరెక్టర్ గా RNG స్వరూప్ డైరెక్షన్ వహించారు. ఇందులో హీరోయిన్ తాప్సీ కూడా ఓ కీలకమైన పాత్రలో నటించబోతోంది. ఇటీవల కాలంలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే ఈ సినిమా చాలా డిఫరెంట్గా ఉంటుందని ప్రేక్షకులు నమ్మకంగా ఉన్నారు.



మిషన్ ఇంపాజిబుల్ సినిమా ప్రమోషన్ లో భాగంగా. ఫన్నీ ప్రమోషన్ వీడియోస్ లను షేర్ చేస్తూ సినిమా పై మరింత ఆసక్తిని పెంచారు చిత్రబృందం. ఇక ఏప్రిల్ ఒకటో తారీకున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధమైనట్లుగా ఒక పోస్టు ద్వారా తెలియజేశారు. ఇక ఈ నెల 15వ తేదీన ఈ సినిమా ట్రైలర్ను ప్రేక్షకుల ముందుకు విడుదల చేయబోతున్నారు. ఇక అలాగే హీరో సూర్య తో తమిళ్ లో ఈ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేయబోతున్నారు. అయితే తమిళ్లో ట్రైలర్ డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు.


ఇక ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేస్తున్నారు కాబట్టి ఈ చిత్రం మరింత హైప్ పెరుగుతుందనే నమ్మకాన్ని తెలియజేస్తున్నారు చిత్రబృందం. ఇక ఈ సినిమా స్టోరీ గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రం కాబట్టి ప్రతి ఒక్కరికి నచ్చుతుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ చిత్రం కదా తిరుపతి సమీపంలోని ఉండే ఒక గ్రామంలో జరిగి నట్లు గా తెలుస్తున్నది. ఈ చిత్రాన్ని అన్ని అన్వేష్ రెడ్డి నాగార్జున రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: