తమన్.. ఇలా కూడా చేస్తున్నాడా!!

P.Nishanth Kumar
ప్రస్తుతం తమన్నా హవా నడుస్తుంది. గత నాలుగు సంవత్సరాలుగా ఆయన చేస్తున్న సినిమాల వరుసను బట్టి ఆయన ఏ స్థాయిలో స్టార్డంను అనుభవిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక ట్యూన్ ఇవ్వమంటే 4 ట్యూన్ లు ఇస్తూ దర్శకుడికి ఎక్కువగా ఆప్షన్స్ ఇస్తూ ఉంటాడు. అదే తమన్ స్పెషాలిటీ. మిగతా వారి కంటే విభిన్నంగా ఆలోచించి ట్యూన్లు చేయడం వల్లనే ఆయన టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా నిలబడడానికి కారణం.

భారీ చిత్రాలకు పని చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకుంటున్న సంగీత దర్శకుడు నేపధ్య సంగీతం విషయంలో కూడా ఎంతో సీరియస్ గా ముందుకు వెళుతూ సినిమాలు విజయవంతం కావడానికి ప్రధాన కారణం అవుతున్నాడు. కేవలం పాటలను మాత్రమే అందించి చేతులు దులుపుకోకుండా ఆ సినిమాకు నేపథ్య సంగీతాన్ని కూడా అంతకు మించిన స్థాయిలో అందిస్తూ అందరినీ అలరిస్తున్నాడు. అదేవిధంగా సంగీతం పరంగా మాత్రమే కాకుండా సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రమోట్ చేస్తున్న తీరు కూడా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది.

 ఇటీవలే విడుదలైన భీమ్లా నాయక సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు సినిమా బృందం కంటే ఎక్కువగా తానే చేశాడు. కొంత మంది సంగీత దర్శకులు తమ పని అయిపోగానే పెద్దగా పట్టించుకోరు. కానీ తమన్  మాత్రం సంగీతం అందించిన ప్రతి సినిమాకి సోషల్ మీడియాలో ప్రచారకర్తగా మారి భారీస్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా రాధే శ్యామ్ చిత్రానికి తమన్ నేపథ్య సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేస్తూ వచ్చాడు తమన్. మహేష్ సినిమా కు కూడా ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఏదేమైనా చిన్న సంగీత దర్శకుడిగా తన కెరీర్ ని మొదలు పెట్టి ఇప్పుడు ఎంతటి స్థాయి సంగీత దర్శకుడిగా ఎదగడం నిజంగా తమన్ ది నుంచి ప్రయాణం అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: