అందాల ముద్దుగుమ్మ ఎస్తర్ నోరోన్హ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఈ ముద్దుగుమ్మ సునీల్ హీరోగా తెరకెక్కుతున్న భీమవరం బుల్లోడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. భీమవరం బుల్లోడు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది, అయితే భీమవరం బుల్లోడు సినిమా తర్వాత ఎస్తర్ నోరోన్హ 1000 అబద్దాలు , గరం వంటి పలు సినిమాల్లో నటించింది. ఇలా సినిమాల్లో నటిస్తున్న సమయం లోనే ఎస్తర్ నోరోన్హ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రముఖ సింగర్ అయిన నోయల్ ని వివాహం చేసుకుంది, కానీ వీరి వివాహ బంధం ఎక్కువ కాలం నిలవలేదు.
పెళ్లి చేసుకున్న ఆరు నెలల లోపే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు, విడాకుల తర్వాత చిన్నా చితకా సినిమాల్లో నటించిన ఎస్తర్ నోరోన్హ తాజాగా 69 సంస్కార్ కాలనీ సినిమాలో ప్రముఖ పాత్రలో నటించింది. ఈ సినిమా ఈ నెల 18 వ తేదీన విడుదల కాబోతుంది , ఈ సినిమా విడుదల సందర్భం గా వరస ఇంటర్వ్యూ లు ఇస్తున్న ఎస్తర్ నోరోన్హ తాజాగా కాస్టింగ్ కౌచ్‌పై ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. ఇండస్ట్రీ లో అన్ ప్రొఫెషనల్ ట్రాక్స్ చూశాను, మూవీ ఆఫర్ లతో పాటు ఈ ఆఫర్లు కూడా వచ్చేవి.. వాళ్లని ఇంప్రెస్ చేయమని వీళ్లని ఇంప్రెస్ చేయమని అనేవాళ్లు అని ఎస్తర్ నోరోన్హ తెలియజేసింది. అవకాశాల కోసం ఏం చేయడానికైనా రెడీ అని చెప్పిన హీరోయిన్ లు కూడా ఉన్నారు, క్యాస్టింగ్ కౌచ్ ను నేను కూడా ఎదుర్కొన్నాను అని ఎస్తర్ నోరోన్హ చెప్పుకొచ్చింది, మరి 69 సంస్కార్ కాలనీ మూవీ తో ఎస్తర్ నోరోన్హ ఎలాంటి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో తెలియాలి అంటే 69 సంస్కార్ కాలనీ మూవీ విడుదల తేదీ వరకు వేచి చూడాల్సిందే.