బాలీవుడ్ సెలబ్రెటీ తో.. ఇంగ్లాండ్ క్రికెటర్ లవ్.. కానీ?

praveen
సినీ సెలబ్రిటీలు క్రికెటర్ల మధ్య ప్రేమ పుట్టడం ఇది ఇప్పటి కాలం లోనే కాదు ఎన్నో రోజుల నుంచి కూడా కొనసాగుతూ వస్తోంది. ఇక కొంతమంది సినీ సెలబ్రిటీలు క్రికెటర్ల మధ్య పుట్టిన ప్రేమ మధ్యలోనే బ్రేకప్ అయితే.. కొంత మంది మాత్రం పెళ్లి వరకు తమ బంధాన్ని తీసుకెళ్లారు. ఇక ఇలా అనూహ్యంగా బ్రేకప్ అయిన వారిలో బాలీవుడ్ నటి అమృత అరోరా ఇంగ్లాండ్ క్రికెటర్ ఉస్మాన్ అబ్దుల్ ప్రేమ కూడా ఒకటి.. వీరిద్దరి మధ్య అనుకోని విధంగా ప్రేమ పుట్టింది. ఆ తర్వాత వీరి ప్రేమ బంధం లో కొన్నాళ్ళ వరకు అంతా బాగానే సాగింది.


 కానీ ఆ తర్వాతే అసలు పాట్లు మొదలయ్యాయి. అమృత అరోరా ముంబై.. ఉస్మాన్ అఫ్జల్ ఇంగ్లాండ్. ఇక తరచూ అమృత అరోరా ని కలిసేందుకు సమయం ఉన్నప్పుడల్లా ప్రయత్నం చేసేవాడు ఉస్మాన్. అయినప్పటికీ ఈ బంధం మాత్రం నిలవలేదు. అమృత కు  పార్టీలు అంటే ఎంతో ఇష్టం.  ఇలా పార్టీ కి వెళ్ళినప్పుడు కలిశాడు ఉస్మాన్. ఇక అమృత చలాకీతనం చూసి ఒక్కసారిగా ప్రేమలో పడిపోయాడు. వెంటనే వెళ్ళి తన మనసులో మాట అమృతకు చెప్పేశాడు. ఇక ఆ తర్వాత అతని గురించి తెలుసుకోవడం మొదలు పెట్టిన అమృత కొన్ని రోజుల్లోనే లవ్ యాక్సెప్ట్ చేసింది.


 ఇక ఉస్మాన్ క్రికెట్లో అమృత సినిమాల్లో బిజీగా ఉండేవారు. కాస్త సమయం దొరికితే చాలు కలుసుకునేవారు. ఇక ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కొన్నాళ్లపాటు బాగా నడిచిన నెమ్మదిగా పలచబడటం మొదలుపెట్టింది. సెలబ్రిటీలు కావడంతో ఇక వీరిద్దరూ దగ్గరగా లేకపోవడం వల్ల ఎన్నో గాసిప్స్ వీళ్ళ ప్రేమ గురించి కాదు అమృత వ్యక్తిత్వం గురించి. ఇక ఆ తర్వాత కాలంలో అమృత ఎక్కువగా మోడల్ శ్రాప్ తో ఎక్కువగా కనబడింది. దీంతో వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందంటూ వార్తలు మొదలయ్యాయి. లండన్ లో ఉన్న  ఉస్మాన్ వరకు ఈ వార్తలు పాకి పోయాయి. సెలబ్రిటీల పై ఇలాంటి వార్తలు  సర్వసాధారణం అంటూ కొట్టిపారేశాడు ఉస్మాన్. ఇక అదే సమయంలో ఉస్మాన్ పుట్టినరోజు. కానీ అమృత షూటింగ్ నేపథ్యంలో లండన్ కి వెళ్ళలేకపోయింది.దీంతో అటు వెంటనే ఎన్నో వార్తలు. వార్తలు అన్నీ ఉస్మాన్ మనసులో ఒక అనుమానాన్ని కలిగించాయి. చివరికి ఓ రోజు ఇద్దరు బ్రేకప్ చెప్పుకునే  వరకు వెళ్లింది. ఆ తర్వాత ఎన్నో రోజుల పాటు బ్రేక్ బాధలో ఉన్న అమృతను కరీనాకపూర్ ఓదార్చింది ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: