సినిమా లలో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ లు స్పెషల్ సాంగ్ లలో నటించడం ప్రస్తుతం ట్రెండ్ గా మారింది, ఇప్పటి వరకూ ఎంతో మంది ఫుల్ క్రేజ్ వున్న హీరోయిన్ లు ఐటమ్ సాంగ్ లలో కనిపించి మెప్పించారు. అందులో భాగంగా హీరోయిన్ గా ఫుల్ ప్రైస్ ఉన్న తమన్నా ఇప్పటికే అల్లుడు శీను, జై లవకుశ, కేజిఎఫ్ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్ లలో నటించి ప్రేక్షకులను అలరించింది, ఈ సినిమాలో మాత్రమే కాకుండా మరి కొన్ని రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉన్నా గని మూవీ లో కూడా తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది.
ఇది ఇలా ఉంటే కాజల్ అగర్వాల్, జూనియర్ ఎన్టీఆర్ హీరో గా తెరకెక్కిన జనతా గ్యారేజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించి మెప్పించింది, పూజా హెగ్డే, రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన సమంత పుష్ప మూవీ లోని సాంగ్ తో ఇండియా వైడ్ గా క్రేజ్ ను సంపాదించుకుంది, ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో రెజీనా కాసండ్ర స్పెషల్ సాంగ్ లో నటించింది, ఈ సినిమా ఏప్రిల్ 29 వ తేదీన విడుదల కాబోతుంది. ఇప్పటికే ఎంతో మంది టాప్ హీరోయిన్ లు స్పెషల్ సాంగ్ లో నటించి ప్రేక్షకులను అలరించారు, ఇది ఇలా ఉంటే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణభీర్ కపూర్ హీరో గా పరిణితి చోప్రా హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం చిత్ర బృందం రష్మిక మందన ను సంప్రదించినట్లు ఒక వార్త అవుతుంది. ఇది ఇలా ఉంటే రష్మిక మందన నటించిన తొలి హిందీ సినిమా మిషన్ మజ్ను జూన్ 10 వ తేదిన విడుదల కాబోతుంది.