అగ్ర రచయిత ఇలా అయిపోయాడేంటి.. అసలు ఏం జరిగింది..?

Anilkumar
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్ర రచయితగానే కాకుండా నటుడిగా కూడా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు పరుచూరి వెంకటేశ్వరరావు. ఒకప్పుడు ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలంటే రచయితగా కచ్చితంగా పరుచూరి బ్రదర్స్ ఉండాల్సిందే. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ నుంచి మొదలుకొని చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలతో కలిసి పనిచేశారు పరుచూరి బ్రదర్స్. ఈజీ ఆఫీసులో ఉద్యోగం చేసే పరుచూరి వెంకటేశ్వరరావు సినిమాలకు రచయితగా పనిచేసేవారు. ఆయన తమ్ముడు గోపాలకృష్ణ కూడా తన అన్నయ్యకు సాయం చేసేవాడు. వీరిద్దరికీ పరుచూరి బ్రదర్స్ అని నామకరణం చేసి ఇండస్ట్రీకి పరిచయం చేశారు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు.

అప్పటి నుంచి కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర రచయితగా మారారు పరుచూరిబ్రదర్స్. సుమారు 300కు పైగా సినిమాలకు పనిచేశారు. కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించి మంచి విజయాన్ని అందుకున్నారు. అలాగే కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికీ పరుచూరి గోపాల కృష్ణ యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఆయన సన్నాఫ్ ఇండియా సినిమా గురించి కూడా గొప్పగా మాట్లాడారు. అయితే ఆయన అన్నయ్య పరుచూరి వెంకటేశ్వరరావు మాత్రం బయట పెద్దగా కనిపించలేదు. ఆయన వయసు ప్రస్తుతం 80 ఏళ్లు. కొంతకాలంగా ఆయన వయోభారంతో ఇబ్బంది పడుతున్నారు.

అంతేకాదు ఆయనకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయట. అయితే ఇటీవల దర్శకుడు జయంత్ సి పరాన్జీ పరుచూరి వెంకటేశ్వరరావు గారిని కలిసారు. ఈ సందర్భంగా ఆయనతో తీసుకున్న ఫోటోని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.' గురువుగారు వెంకటేశ్వరరావు గారిని చూసి బాధ పడ్డాను. కానీ దేవుడి దయవల్ల ఆయన మానసిక స్థితి ఎప్పటికీ యాక్టివ్గానే ఉంది' అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఈ ఫోటోలు చూసిన వారంతా షాక్ అవుతున్నారు. పరుచూరి వెంకటేశ్వరరావు గారు ఏంటి ఇలా అయిపోయారు అంటూ కామెంట్ చేస్తున్నారు. కొంతమంది అయితే వెంకటేశ్వర రావు గారిని గుర్తుపట్టడానికి చాలా సమయం తీసుకుంటున్నారు. ఈ మేరకు గురువు గారు.. ఏమైంది.. మీరు ఇలా అయిపోయారు ఏంటి? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అయితే ఆయనకు వయస్సు మీద పడడంతో ఇలా అయిపోయారని తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: