అఖిల్ మూవీ కూడ పాన్ ఇండియా మూవీ నేనా..?

Divya
మొదటి నుంచి డిజాస్టర్ మూవీ లలో నటిస్తూ ఎట్టకేలకు "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు హీరో అఖిల్. ఇక ఈ సినిమాతో తన నటనను కూడా కాస్త మార్చుకున్నారని చెప్పవచ్చు. అయితే ఈ హీరో ని మరింత టాలెంటెడ్ గా చూపించే బాధ్యత డైరెక్టర్ సురేందర్ రెడ్డి తీసుకున్నారు. అందుచేతనే వీరిద్దరి కాంబినేషన్ లో ఏజెంట్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఇద్దరు చాలా కష్టపడుతున్నారు అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి కథ వక్కంతం వంశీ అందించారు.


ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా రామబ్రహ్మం సుంకర చేస్తున్నారు. సినిమాకు సంబంధించి షూటింగ్ మొత్తం హైదరాబాద్ పరిసరాల్లోనే జరుగుతున్నాదట. ఇక ఇందులో అఖిల్ తో పాటుగా ఆ చిత్ర బృందం మొత్తం పాల్గొన్నట్లు గా తెలుస్తోంది. మమ్ముట్టి కూడా ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కు జాయిన్ అయ్యారు. ఇక ఇలాంటి పనులు జరుగుతున్న సమయంలోనే విడుదల తేదీని ఖరారు చేయడం జరిగింది. ఈ చిత్రం ఆగస్టు 12వ తేదీన ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారని చిత్ర బృందం ఒక ప్రకటనను తెలియజేసింది.


ఏజెంట్ చిత్రంలో అఖిల్ అండర్ కవర్ ఆపరేషన్ ఏజెంట్ గా నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మమ్ముటి కూడా ఇందులో అదే తరహా పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. అందుచేతనే ఈ సినిమాని ఇండిపెండెన్స్ డే దగ్గరగా ఉండే రోజుల్లోనే విడుదల చేయాలని చిత్రబృందం ఆలోచించింది. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఈ సినిమా విడుదల ఒకరోజు ముందే లాల్సింగ్ చద్దా సినిమా కూడా విడుదల అవుతోంది. ఇక అఖిల్ సినిమా మాత్రం తెలుగు మరియు మలయాళం లోనే విడుదల చేస్తున్నారు.. ఒకవేళ మార్కెట్ ను బట్టి పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయాలా లేదా ఆలోచిస్తామని చిత్రబృందం తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: