'రాధే శ్యామ్' హైలైట్స్ లీక్..?

Anilkumar
మరికొద్ది సేపట్లో ఎంతోమంది ఈ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాధేశ్యాం సినిమా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో లో ప్రభాస్ అభిమానులు భారీ కటౌట్లు ఏర్పాటు లో బిజీగా ఉన్నారు ఇక మరికొందరు థియేటర్ల ముందు సినిమా ఎప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. మరికొందరు ఓటర్లను భారీగా ముస్తాబు చేసే పనిలో ఉన్నారు. ఎలా ఉంటే మరికొందరు మాత్రం సినిమా టాక్ ఏ విధంగా ఉంటుందోనని  ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే అసలు విషయంలోకి వెళ్తే అయితే సినిమాలోని మేజర్ హైలైట్స్ , సినిమాకు ప్రాణం పొసే సన్నివేశాలు బయటకు లీక్ అవ్వడం జరిగింది.


ఇకపోతే మనందరికీ ఈ సినిమా విధి ఆడే వింత నాటకం నుంచి హీరో తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నాడన్న కాన్సెప్టుతో ఈ మూవీ రూపుదిద్దుకుంది.  పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన ఈ  సినిమాలో స్వతహాగా జోతిష్యుడు అయిన హీరోకు భవిష్యత్ గురించి తెలుస్తుంది.అయితే దీని ద్వారానే ఒక సందర్భంలో ట్రైన్ ప్రమాదం నుంచి.. మరో సందర్భంలో ఓడ ప్రమాదం నుంచి హీరోయిన్‌ను కాపాడడం జరుగుతుందట. అయితే ఈ సినిమాలోని ఈ రెండు ఎపిసోడ్లు సినిమాకే హైలైట్‌గా ఉంటాయట.అంతేకాకుండా  ఇంటర్వెల్ ముందు వచ్చే మిస్టరీ ట్రైన్ సీక్వెన్స్ హైలైట్‌గా ఉంటుందని అంటూ. అంతేకాదు అలాగే, క్లైమాక్స్‌లో వచ్చే ఓడ ప్రమాదం కూడా విజువల్ వండర్‌గా ఉంటుందట.


 దాంతోపాటు ఆ రెండు సీన్లు వచ్చేటప్పుడు ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేల ఉంటాయట. అయితే ఆ రెండు సీన్లు చూసేందుకు రెండు కళ్లు చాలవని అంటున్నారు. ఇక సినిమా గురించి వీరు చెపుతుంటేనే ఇలా ఉంది.. స్వయంగా మన కళ్లారా థియేటర్స్ లలో సినిమాని చూస్తే ఎలా ఉంటుందో మరి. టి సిరీస్, యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ ఈ సినిమాని నిర్మించారు.సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి మరో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: