రామ్ చరణ్ పుట్టిన రోజు శంకర్ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ రాబోతుందా..?

frame రామ్ చరణ్ పుట్టిన రోజు శంకర్ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ రాబోతుందా..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయాన్ని ఎదుర్కొన్నడు,  అలా వినయ విధేయ రామ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయాన్ని ఎదుర్కొన్న రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించాడు, ఈ సినిమా మార్చి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇది ఇలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్'  సినిమా సెట్స్ పై ఉండగానే శంకర్ దర్శకత్వంలో దిల్ రాజ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న  ఒక భారీ పాన్ ఇండియా సినిమాను స్టార్ట్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే, ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది,   ఈ భారీ పాన్ ఇండియా సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూరుస్తూ ఉండగా ఈ సినిమాలో సునీల్ , అంజలి కీలక పాత్ర లలో కనిపించబోతున్నారు. 


 ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు టైటిల్ ను అఫీషియల్ గా రామ్ చరణ్ పుట్టిన రోజు అయిన మార్చి 27 వ తేదీన అనౌన్స్మెంట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఈ సినిమాకు సర్కారోడు అనే టైటిల్ ను చిత్ర బృందం  రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయనున్నట్లు ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి అంటే  మార్చి 27 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే,  ఇది ఇలా ఉంటే ఈ సినిమా లో ఎస్ జె సూర్య ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారు తెలుస్తోంది,  ఈ సినిమాను దర్శకుడు శంకర్ భారీ హంగులతో ,  ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ,  గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: