"ఆర్ ఆర్ ఆర్": దుబాయ్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్... డేట్ ఫిక్స్?
ఈ సినిమా కోసం ఒక్క తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచంలోని సినిమా అభిమానులు అంతా ఎంతగానో ఎదురు చూస్తున్న ఏకైక మూవీ "ఆర్ ఆర్ ఆర్". ఇందులో టాలీవుడ్ టాప్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషించారు. బాలీవుడ్ నుండి స్టార్ హీరోయిన్ అలియాభట్ మరియు అజయ్ దేవగణ్ లు కీలక పాత్రలు చేశారు. ఈ సినిమాను మార్చ్ 25 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే సినిమా నుండి విడుదల అయిన టీజర్, ట్రైలర్ మరియు సాంగ్స్ ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి.
దీనితో గత కొద్ది రోజుల నుండి చిత్ర బృందం ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. అందులో భాగంగా తాజాగా ప్రి రిలీజ్ ఈవెంట్ గురించిన సమాచారం తెలిసింది. సినిమా విడుదలకు ముందు రెండు భారీ ప్రి రిలీజ్ ఈవెంట్ లను ప్లాన్ చేశాడట జక్కన్న. అందులో ఒకటి మార్చి 18 న దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా వేదికగా భారీ స్థాయిలో ఈ ప్రి రిలీజ్ ఈవెంట్ ను జరపనున్నారు అని తెలుస్తోంది. తర్వాత రోజు మార్చ్ 19 న కర్ణాటక రాష్ట్రంలో మరో ప్రి రిలీజ్ ఈవెంట్ ను చేయనున్నారు. దుబాయ్ లో జరగబోయే ఈవెంట్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు మొదలు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఈవెంట్ కోసం ఎవరెవరు అతిథులు రానున్నారు ? సమయం ఏంటి ? లాంటి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.