బిగ్ బాస్ ఓటిటి : వామ్మో.. తలలు పగలగొట్టుకునే స్థాయికి వెళ్లారు?
ఇక హౌస్ మొత్తంలో కేవలం నటరాజ్ మాస్టర్ అనిల్ ఇద్దరు మాత్రమే బాస్కెట్ లో బాల్ వేయగలిగారు. మిగతా వాళ్లు ప్రయత్నించినా అది కుదరలేదు. ఇక ఆ తర్వాత టాస్క్ లో భాగంగా వారియర్స్ టీం సభ్యులు స్మగ్లర్లు గా చాలెంజర్స్ టీం సభ్యులు పోలీసులు గా మారిపోయారు ఇక పోలీసుల కళ్లుగప్పి ఇంట్లో బొమ్మల్ని స్మగ్లింగ్ చేయాల్సి ఉంటుంది. పోలీసులు చెక్ పోస్టుల వద్ద అడ్డుకోవాల్సి ఉంటుంది.. చాలెంజర్స్ డోర్స్ క్లోజ్ చేసి గేమ్ ముందుకు సాగనివ్వలేదు. దీంతో నట్రాజ్ మాస్టర్ మహేష్ విట్టల్ సహనం కోల్పోయారు. మగాడివైతే డోర్ తీయ్ అంటూ యాంకర్ శివ పై విరుచుకుపడటంతో మాటల యుద్ధం చేస్తారు.
ఈ క్రమంలోనే ఇక వారియర్స్ రెచ్చిపోయారు. పైనుంచి బొమ్మలను విసురుతూ రచ్చ చేశారు. దీంతో అషురెడ్డి అడ్డంగా ఆడుతూ బొమ్మని శ్రీ రాపాక తలపైన విసిరి కొట్టింది. దీంతో దెబ్బకి కుప్పకూలిపోయింది రాపాక. తర్వాత వాళ్లు బాధలో ఉంటే వారియర్స్ మాత్రం కావాలని కొట్టలేదుగా అంటూ ఇక సర్దిచెప్పే ప్రయత్నం చేసింది అషు రెడ్డి. ఇక ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ బిందుమాధవి మధ్య గొడవ జరగడంతో హౌస్ మొత్తం హాట్ హాట్ గా మారిపోయింది..