ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కావడానికి అసలు కారణం అదే..!!

Purushottham Vinay
ఇక తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ అలా అలా నత్తలాగా స్లో గా సాగిపోతుంది. కక్రుత్తి పడి డబ్బులు కోసం ఓటిటిలో టెలికాస్ట్ చేస్తున్నారు. మోదిలే లాస్ట్ సీజన్ బిగ్ బాస్ 5 చరిత్రలోనే అత్యంత చెత్త సీజన్ ఇంకా చెత్త హౌస్ మేట్స్ కలిగిన సీజన్ గా రికార్డు సృష్టించింది. ఇక దాంతో బిగ్ బాస్ ఒక చెత్త షో అని ఏదోలే అలా పొద్దుపొక టైం పాస్ కి టీవిలో బిగ్ బాస్ షోని చూసే జనాలు ఈ ఓటీటీ బిగ్ బాస్ గురించి అయితే అస్సలు మాట్లాడుకోవడం లేదు. ఈ దిక్కుమాలిన షో గురించి నెట్టింట పెద్ద ఎత్తున చర్చ కూడా ఏమాత్రం సాగడం లేదు.ఇక మొదటి వారం పూర్తి అయిన తర్వాత హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనే విషయంలో లీక్ అనేది వచ్చింది.ఫస్ట్ వీక్ లో సరయు,మిత్రా శర్మ,హమీదా,నటరాజ్ మాస్టర్,ఆర్జే చైతూ ఇంకా ముమైత్,అరియానాలు ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యారు. వీరిలో మిత్రా ఇంకా నటరాజ్ మాస్టర్ లకు నెగటివిటీ ఎక్కువ ఉంటుందని మొదటి రెండు రోజుల చర్చ అనేది జరిగింది. కాని అనూహ్యంగా ముమైత్ ఖాన్ చేసిన ఓవర్ యాక్షన్ అనేది దెబ్బకు ఆమె ఎలిమినేషన్ కు దారి తీసింది.


మిత్రా శర్మ గ్రాఫ్ అనూహ్యంగా పెరిగిపోయింది. ముమైత్ గ్రాఫ్ అనేది దిగి పోయింది. ఆర్జే చైతూ ఒక సందర్బంలో ప్రతి రోజు ఉదయమే సిగరెట్ల కోసం కెమెరాల వద్దకు వెళ్లి ముమైత్ ను అడుక్కోవడం నచ్చలేదు అన్నట్లుగా మొహం మీదే చెప్పాడు. అది కాస్త ముమైత్ ఖాన్ వేరే యాంగిల్ లో తీసుకుంది. దాదాపు రెండు రోజుల పాటు ఆ ఇష్యూను బాగా డ్రాగ్ చేస్తూ ముమైత్ ప్రేక్షకులకు బాగా చిరాకు తెప్పించింది.ఆ కారణంగానే ముమైత్ ఖాన్ ను జనాలు పట్టించుకోకుండా ఉంటారు అనిపిస్తుంది అంటూ నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ముమైత్ ఖాన్ కు అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమె బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లి పోవాల్సి వచ్చింది. బిగ్ బాస్ షో లో కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ కు వారి ప్రవర్తన అనేది నూటికి నూరు శాతం కారణం ఉంటుంది. ఇక ముమైత్ ఖాన్ ప్రవర్తన ఆమె నామినేషన్ లో ఉండటానికి ప్రధాన కారణం అయ్యింది.. ఆ తర్వాత ఎలిమినేషన్ కు కూడా కారణంగా నిలిచిందని సోషల్ మీడియా నుంచి అనేక రకాల కామెంట్స్ అనేవి వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: