అలరిస్తున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' కొత్త టీజర్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  శర్వానంద్ ఇప్పటి వరకు ఎన్నో హిట్,  సూపర్ హిట్ సినిమా లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు.  ఇలా ఎన్నో విజయవంతమైన సినిమా లతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న శర్వానంద్ గత కొంత కాలంగా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను అందుకోవడంలో కాస్త స్లో అయ్యాడు,   ఇది ఇలా ఉంటే తాజాగా శర్వానంద్,   కిషోర్ తిరుమల దర్శకత్వం లో రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు,  ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఫిబ్రవరి 4 వ తేదీ న థియేటర్ లలో  విడుదల అయ్యింది.  ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుండే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫర్వాలేదు అనే టాక్ ను సంపాదించుకొని ప్రస్తుతం కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే రాబడుతుంది,  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా నుండి ఈ చిత్ర బృందం తాజాగా ఒక టీజర్ ను విడుదల చేసింది.


 ప్రస్తుతం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న  ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రం తాజాగా విడుదల చేసిన టీజర్ లో నేనేమ‌న్నా ఉప్మాలో జీడీ పప్పు రాలేద‌ని బాధ‌ప‌డుతున్నానా.? ఇంకా పెళ్లి కాలేద‌ని బాధ‌ప‌డుతున్నా అంటూ శ‌ర్వానంద్ ఈ టీజర్ లో చెప్పిన డైలాగ్ అలరిస్తోంది,  సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌ పై ఈ సినిమాను తెరకెక్కించాడు,  ఈ మూవీ లో ఖుష్బు,  రాధికా శరత్ కుమార్, ఊర్వశి కీల‌క‌ పాత్రల్లో న‌టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: