ప్రస్తుతం 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లకు ప్రేక్షకుల్లో ఎ రేంజ్ క్రేజ్ ఉందో మన అందరికీ తెలిసిన విషయమే, ప్రస్తుతం కొన్ని సినిమాలు నేరుగా 'ఓ టి టి' లో విడుదల అవుతూ ఉంటే , మరికొన్ని సినిమాలు థియేటర్లలో విడుదల అయినప్పటికీ అతి తక్కువ కాలంలోనే ఏదో ఒక 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం వరకు స్టార్ హీరోల సినిమాలు కాంత ఆలస్యంగా 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ అయ్యేవి, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు కూడా మారిపోయాయి, స్టార్ హీరోల సినిమాలు కూడా అతి తక్కువ కాలంలోనే ఏదో ఒక 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతూ వస్తున్నాయి.
ఇందుకు ప్రధాన కారణం ప్రేక్షకులు 'ఓ టి టి' లలో సినిమాలను చూడడానికి ఎక్కువ ఇంటెస్టు చూపిస్తూ ఉండటం, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల బయటికి వెళ్లి సినిమాలు చూడడం కంటే ఇంట్లో కూర్చొని కుటుంబ మంత కలిసి సినిమాను చూడటం మంచిది అని చాలా మంది భావించడంతో ప్రస్తుతం 'ఓ టి టి' లకు క్రేజ్ పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా ఎన్నో అంచనాల నడుమ ఫిబ్రవరి 25 వ తేదీన విడులై ప్రస్తుతం థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న భీమ్లా నాయక్ సినిమా మార్చి నెలాఖరులో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఇది ఇలా ఉంటే విడుదలైన మూడు రోజుల్లోనే భీమ్లా నాయక సినిమా వంద కోట్లకు పైగా కలెక్షన్లను సాధించినట్లు తెలుస్తోంది, భీమ్లా నాయక్ సినిమాకు సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే ను అందించాడు, తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు.