గంగుబాయ్ పాత్ర ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్లు.. కారణం..?

Anilkumar
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించిన సినిమా గంగుబాయి కథియావాడి.ఇకపోతే ఈ సినిమాను హుస్సేన్ జైదీ రాసిన 'మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై' ఆధారంగా స్టార్‌ డైరెక్టర్‌ సంజయ్ లీలా భన్సాలీ  ఈ సినిమాను తెరకెక్కించారు.ఇకపోతే ఈ సినిమా సుమారు రూ.100కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది.అంతేకాకుండా ఈ సినిమా  ఫిబ్రవరి 25న హిందీతో పాటు తెలుగులో విడుదలైంది. ఇకపోతే ఈ సినిమా విడుదల అనంతరం సౌత్‌లో గంగుబాయి హడావిడి పెద్దగా కనిపించకపోయినప్పటికీ బాలీవుడ్‌ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.అయితే సినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.57 కోట్ల దాకా వసూలు చేసిందని ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు.అంతేకాదు   ఈ సినిమాలో మాఫియా క్వీన్‌ పాత్రలో అదరగొట్టింది అలియా భట్‌.


అయితే  ఒక కుర్ర హీరోయిన్ అంతటి బరువైన పాత్ర చేయగలదా? అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుందీ తార.అలియా భట్  గంగుబాయి పాత్రలో కోసం ముందుగా అలియాను అనుకోలేదట. అయితే ఆమె కంటే ముందు ముగ్గురు హీరోయిన్ల దగ్గరికీ ఈ సినిమా స్ర్కిప్టు వెళ్లిందట. అంతేకాదు ముందుగా గంగుబాయి పాత్రకోసం దీపికా పదుకొణె దగ్గరకు వెళ్లారట భన్సాలీ.ఇక  అంతకు ముందే దీపికతో ఆయన పద్మావత్ లాంటి సూపర్‌హిట్ సినిమాను తెరకెక్కించారు.ఇక అప్పటికే దీపిక ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడంతో గంగుబాయికి నో చెప్పిదంట. కాగా తర్వాత గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంకను సంప్రందించాలనుకున్నారట. ఇకపోతే  అంతలోనే గంగుబాయి కథకు మిమ్మల్ని అనుకుంటున్నారట అని ఆమెను అడగ్గా ‘ నా దగ్గరకు ఎవరూ ఆ కథతో రాలేదు.


ఇక తాజాగా  నేను హాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉన్నాను. అందుకు హిందీ సినిమాలను అంగీకరించలేను’ అని తేల్చి చెప్పేసిందట. ఇక దీంతో ప్రియాంక దగ్గరకు వెళ్లకుండానే డ్రాప్‌ అయ్యారట దర్శక నిర్మాతలు.అయితే  గతంలో సంజయ్‌లీలా భన్సాలీ డైరెక్ట్‌ చేసిన పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది రాణీ ముఖర్జీ.కాగా దీంతో మరోసారి ఆమెతోనే సినిమా చేద్దామనుకున్నారట. అంతేకాదు వ్యక్తిగత కారణాల వల్ల గంగుబాయి ఆఫర్‌ను తిరస్కరించిందట రాణీ. ఇకపోతే అలా చివరగా ఈ అవకాశం అలియా చెంతకు చేరినట్లు టాక్. అయితే ఇప్పటివరకు గ్లామరస్‌ పాత్రలతోనే ఎక్కువగా ఆకట్టుకున్న ఈ అందాల తార ‘గంగుబాయి’తో లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు సైతం తానే పర్‌ఫెక్ట్‌ ఛాయిస అని నిరూపించుకుంది ఈమె..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: