శ్రీముఖి కి బుల్లితెర పై ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనతి కాలంలోనే స్టార్ ఫిమేల్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత వెండితెరపై కూడా పలు కీలక పాత్రలు పోషిస్తూ నటిగా ప్రూవ్ చేసుకుంది. టెలివిజన్ రంగంలో గుర్తింపు తెచ్చుకొని సిల్వర్ స్క్రీన్ పై అవకాశాలు అందుకుంటున్న వాళ్లలో శ్రీముఖి కూడా ఒకరు. అయితే ఈమె యాంకర్ కాక ముందు చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఈమెను అంతగా ఎవరూ గుర్తించలేదు. ఎప్పుడైతే బుల్లితెరపై యాంకర్‌గా మారిందో అప్పటినుంచి శ్రీముఖి కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇక ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ మరోవైపు సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఆరబోస్తోంది ఈ బొద్దుగుమ్మ.
ఇదిలా ఉంటే తాజాగా తన స్మాల్ స్క్రీన్ అందాలతో ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది శ్రీముఖి. ఇక ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా తన అభిమానంతో షేర్ చేసుకుంది. తాను మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమాని అవడంతో ఆయన సినిమాలో నటించడం హ్యాపీగా ఉందని చెబుతోంది ఈ హాట్ యాంకర్. త్వరలో విడుదల కాబోతున్న చిరంజీవి 'భోళా శంకర్' సినిమాలోనే శ్రీముఖి నటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ కూడా ఓ స్పెషల్ సాంగ్ కి ఎంపికైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో బుల్లితెర యాంకర్ శ్రీముఖి కూడా మెగాస్టార్ సినిమాలో భాగం కావడంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.
అయితే సినిమాలో శ్రీముఖి పోషిస్తున్న పాత్ర గురించి మాత్రం రివీల్ చేయలేదు. ఆ విషయాన్ని మాత్రం సస్పెన్స్ గా ఉంచింది. ఇక త్వరలోనే మెగాస్టార్ సినిమాలో శ్రీముఖి పాత్ర గురించి చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. బోలా శంకర్ సినిమా నుంచి ఇటీవల మహాశివరాత్రి సందర్భంగా చిరంజీవి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదలై భారీ రెస్పాన్స్ ని అందుకున్న సంగతి తెలిసిందే. సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు కు చెల్లెలి గా కీర్తి సురేష్ నటిస్తుండగా.. తమన్నా హీరోయిన్ గా కనిపించనుంది...!!