ప్రమోషన్ లతో సినిమాపై అంచనాలను పెంచేస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రబృందం..!

Pulgam Srinivas
సినిమాకు ప్రమోషన్ లు అనేవి చాలా ముఖ్యం,  సినిమా లో ఎంత మంచి నటి నటులు ఉన్నప్పటికీ , ఆ సినిమా కథ ఎంత బాగున్నప్పటికీ,  ఆ సినిమాను  ఎంత బాగా తెరకెక్కించినప్పటికీ ఆ సినిమాకు గనుక సరైన పద్ధతి లో ప్రమోషన్ లు చేయానట్లు అయితే ఆ సినిమా ప్రేక్షకుల దగ్గరకు వెళ్లకుండా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయే అవకాశాలు ఉంటాయి.  అదే కనుక సినిమా కు సరైన ప్రమోషన్ లు జరిగినట్లు అయితే ఆ సినిమా జనాల్లోకి వెళ్లి,  ఆ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడం,  ఆ తర్వాత మంచి విజయాన్ని అందుకోవడం ఇలా జరుగుతూ ఉంటాయి.  అయితే ప్రస్తుతం ఇలాగే ప్రమోషన్ లపై ఫోకస్ పెట్టింది ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్ర బృందం,  శర్వానంద్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాకు తిరుమల కిషోర్ దర్శకత్వం వహించాడు,  ఈ సినిమాలో కొన్ని రోజుల క్రితం ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.  అయితే ఆ తర్వాత అనూహ్యంగా  ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం వాయిదా వేసింది,  ఇది ఇలా ఉంటే మార్చి 4 వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం ప్రకటించింది,  ఇలా ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఈ చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ పెంచింది.  


అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ను భారీ ఎత్తున్న చిత్ర బృందం నిర్వహించింది,  అలాగే ఈ సినిమాకు సంబంధించిన  పాటలను కూడా ఒక దాని తర్వాత ఒకటి విడుదల చేస్తూ వస్తోంది,  వీటిని కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది, ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ లకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.  ఇదిలా ఉంటే తాజాగా కూడా ఈ సినిమా నుండి ఒక సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది,  ఈ సాంగ్ 'ఓ మై ఆద్య'  అంటూ సాగుతుంది, ఈ సాంగ్ కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది,  ఇలా ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్ర బృందం ప్రమోషన్ లతో సినిమాపై అంచనాలను పెంచుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: