ఆ స్టార్ హీరోకి సారీ చెప్పిన పూజా హెగ్డే..?

Anilkumar
ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో పూజా హెగ్డే కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సౌత్ లోనే స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. నిజానికి కెరీర్ మొదట్లో అన్ని ప్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. దీంతో నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి భయపడ్డారు. అయితే ఆ తర్వాత ఎలాగోలా ఎన్టీఆర్ సినిమాలో అవకాశం అందుకొని భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని.. ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్లనే తన కోసం ఎదురు చూసేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఓవైపు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తనకు లైఫ్ ఇచ్చిన దర్శకులతో సినిమాలు చేస్తోంది.


ఇక తాజాగా ప్రభాస్ కి జోడీగా పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మార్చి 11 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్ లో బిజీ అవుతోంది చిత్ర బృందం. అయితే మొన్నటి వరకు ఎడమొహం పెడమొహంగా ఉన్న ప్రభాస్, పూజా హెగ్డే.. ఇప్పుడు మాత్రం పాలు నీళ్ళలా కలిసిపోయారు. ఇద్దరూ కలిసి ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారట. నిజానికి ఈ సినిమా షూటింగ్ సమయంలో పూజా హెగ్డే ప్రభాస్ కి మధ్య గొడవ జరిగిందని.. దాంతో కొన్ని రోజులు షూటింగ్ కూడా ఆపేశారని.. ఎంతమంది ప్రయత్నించినా కూడా వాళ్ళు కలవడానికి సిద్ధంగా లేరనే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.


అయితే తాజా సమాచారం ప్రకారం పూజాహెగ్డే ప్రభాస్ కు సారీ చెప్పి ప్రాబ్లం సాల్వ్ చేసుకుందట. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోతో గొడవ పెట్టుకుంటే కష్టం అనుకుందో ఏమో తెలీదు కానీ తానే స్వయంగా ప్రభాస్ దగ్గరికి వెళ్లి సారీ చెప్పిందట. అయితే కొందరు మాత్రం పూజ హెగ్డే కి కోపం ఎక్కువ అని.. త్వరగా రియాక్ట్ అయిపోతుందని ఆ తర్వాత తన తప్పు తాను తెలుసుకొని అవతలి వ్యక్తిని కూల్ చేస్తుందని ఆమె సన్నిహితులు అంటున్నారు. అయితే ఈ వార్త తెలిసిన ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఏదైతేనేం మొత్తంగా వాళ్ళిద్దరూ కలిసిపోయారు. మాకు అదే చాలంటూ కామెంట్స్ చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: