భోళా శంకర్ ఫస్ట్ లుక్ అదుర్స్..వీడియోస్ వైరల్..!!

Divya
చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసినదే.. ఇప్పటికే మాస్ డైరెక్టర్ అయిన కొరటాల శివతో కలిసి ఆచార్య సినిమాలో పూర్తి చేశారు. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక ఆ తర్వాత గాడ్ ఫాదర్, భోళా శంకర్ వంటి సినిమాలలో చాలా బిజీగా ఉన్నారు చిరంజీవి. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలకు సంబంధించి షూటింగులు కూడా చాలా వేగవంతంగా చేసుకుంటున్నారు. ఇక తమిళంలో మంచి విజయం అందుకున్న వేదాళం సినిమాకి రీమేక్ గా భోళా శంకర్ చిత్రాన్ని తెరకెక్కించడం జరుగుతోంది.


ఇక ఇందులో ఎక్కువగా చెల్లెలు సెంటిమెంట్ ను ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ఇది. ఇందులో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది.. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్ లు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇక చిరంజీవి సినిమాల కోసం ఆయన అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ రోజున శివరాత్రి పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక ఫస్ట్ లుక్ వీడియో ని విడుదల చేయడం జరిగింది ఈ చిత్ర బృందం. ఈ ఫోటో వైబ్ ఆఫ్ భోళా గా విడుదల చేయడం జరిగింది.

తాజాగా విడుదలైన పోస్టర్లలో చిరంజీవి న్యూ లుక్ బాగా ఆకట్టుకుంటోంది. ఇక అన్నాచెల్లెళ్ల నేపథ్యంలో సాగు తోంది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగును హైదరాబాద్లోనే జరుపుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాని M.K ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించడం జరిగింది. ఇందులో చిరంజీవి సరసన తమన్నా నటిస్తూ వుండడం  గమనార్హం. ఏది ఏమైనా ఈ  శివరాత్రికి మెగా అభిమానులకు మంచి ఊరట తెచ్చారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇందులో మెగాస్టార్ చిరంజీవి లుక్ చాలా సాలిడ్ గా ఉందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: