కే.జి.ఎఫ్.2 నుంచి ట్రైలర్ అప్డేట్..!!

Divya
కే జి ఎఫ్ మూవీ విడుదలై దాదాపుగా కొన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ సినిమా హవా ఇంకా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇక ఈ సినిమా నుంచి సీక్వెల్ కోసం ఎంతోమంది ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. హీరో యష్ కేవలం ఈ సినిమాతోనే మంచి నటుడుగా ప్రపంచ వ్యాప్తంగా అందరికీ దగ్గరయ్యాడు. ఇక కే.జి.ఎఫ్ సినిమాకి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇందులో ఎంత మంది బాలీవుడ్ స్టార్లు కూడా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.


ముఖ్యంగా రవీనాటాండన్, సంజయ్దత్ వంటివారు స్పెషల్ రోల్ లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా వాస్తవానికి ఎప్పుడు విడుదల కావాల్సి ఉండగా.. కరోనా, లాక్ డౌన్ కారణంగా వాయిదా పడుతూనే వస్తోంది. ఇక తాజాగా రెండు రోజుల క్రితం ఈ సినిమా నుంచి ఏ విధమైన అప్డేట్ కావాలని ఒక పొల్ ని పెట్టడం జరిగింది చిత్రబృందం. అయితే అందులో 70 శాతం మంది మాత్రం ట్రైలర్ కావాలంటూ తెలియజేశారు. దీంతో హోమ్ బలే టీం మరొక ట్వీట్ చేయడం జరిగింది. కే జి ఎఫ్ సినిమా పై చూపించిన ఆదరణను చూసి తమకు ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు త్వరలోనే ఒక అదిరిపోయే అప్డేట్ను విడుదల చేయబోతున్నారు అంటూ తెలియజేశారు.

ఇక ప్రస్తుత సమాచారం ప్రకారం కే జి ఎఫ్ 2 ట్రైలర్ మార్చి 8వ తారీకున విడుదల అవుతున్నట్టు సమాచారం. ఇక ఈ ట్రైలర్ కూడా మీ అంచనాలను మించేలా ఉంటుందని తెలియజేశారు. అయితే మొత్తానికి ఈ చాప్టర్ టు ట్రైలర్ త్వరలోనే విడుదల అవుతోందని మనం చెప్పుకోవచ్చు. ఇక సినిమా విషయానికొస్తే ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర బృందం ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాని ఎవరూ మరిచిపోకుండా ఉండేందుకు అప్పుడప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒకటి త్వరగా చేస్తున్నారు చిత్ర బృందం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: