కాలాన్ని నమ్ముకుంటున్న హీరోలు !
ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా గురించి నిర్మాతలు ఒక రేంజ్లో చెబుతున్నారు. వరల్డ్ క్లాస్ పిక్చర్ అని, ఆడియన్స్ థ్రిల్ అవుతారని చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. దీంతో ఈ సినిమా స్టోరీ ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఎక్కువైంది. అయితే ఈ సినిమా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ అనే ప్రచారం జరుగుతోంది. 'ప్రాజెక్ట్-కె'లో హీరో టైమ్ మెషీన్ ఎక్కి ఫ్యూచర్లోకి వెళ్తాడట. ఇక ఈ టైమ్ మెషీన్ కాన్పెప్ట్ కోసమే సింగీతం శ్రీనివాసరావు సహాయం తీసుకుంటున్నాడట నాగ్ అశ్విన్.
రాహుల్ సాంకృత్యాన్ రీసెంట్‌గానే తలమీద తంతే గత జన్మ గుర్తుకువస్తుందనే కాన్సెప్ట్‌తో 'శ్యామ్ సింగరాయ్' తీశాడు. నాని, సాయి పల్లవి, కృతి శెట్టి లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. నెక్ట్స్ కూడా సిమిలర్‌గా ఇలాంటి కాన్సెప్ట్‌తోనే సినిమా చేస్తున్నాడట. నాగచైతన్యతో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో సినిమా చేస్తాడని, మైత్రీ మూవీ మేకర్స్‌లో ఈ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
సూర్య, విక్రమ్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన '24' సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సందడి చెయ్యలేదు గానీ, సోషల్ మీడియాలో ఇప్పటికీ ఈ సినిమా టాపిక్ కనిపిస్తూనే ఉంటుంది. మీమ్స్‌లో అయితే సూర్య '24'కి క్రేజీ ప్లేస్ ఉంది. ఇక ఈ సినిమాకి ఇప్పుడీ సక్వెల్ రెడీ అవుతోందని చెప్తున్నారు. ఇప్పటికే డిస్కషన్లు పూర్తి అయ్యాయని, మరోసారి సూర్య వాచ్ పెట్టుకుని భూత, భవిష్యత్ కాలాలకి వెళ్లబోతున్నాడని తెలుస్తోంది.
కళ్యాణ్ రామ్ ఫస్ట్ టైమ్ చేస్తోన్న పీరియాడికల్ డ్రామా 'బింబిసార-ఎ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవెల్ టు గుడ్'. టైటిల్‌తోనే ఈ సినిమా టైమ్ ట్రావెల్ అని చెప్పేశాడు. ప్రజెంట్ డేస్ నుంచి 'బింబిసార' కాలానికి వెళ్లే కథగా తెరకెక్కుతోందీ సినిమా.
శర్వానంద్ తెలుగు, తమిళ్లో శ్రీ కార్తీక్ దర్శకత్వంలో చేస్తోన్న సినిమా 'ఒకే ఒక జీవితం'. ఈ సినిమాలో విచిత్రమైన టైమ్ ట్రావెల్ ఉంటుందని తెలుస్తోంది. శర్వానంద్ ఫ్రెండ్స్‌తో కలిసి చైల్డ్‌వుడ్ డేస్‌లోకి వెళ్లే కాన్సెప్ట్ ఉందని చెప్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రోమోస్‌తో ఈ టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్‌ని రివీల్ చేశారు మేకర్స్.