ఇదీ సంగతి : హీరోయిన్లను ప్రభాస్ ఇలా ఆకట్టుకుంటున్నాడా..?
ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ 'ఆదిపురుష్' చేస్తున్నాడు. ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా నటిస్తే, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్ర పోషించాడు. ఒకసారి 'ఆదిపురుష్' హైదరాబాద్ షెడ్యూల్‌కి సైఫ్‌తో పాటు అతని భార్య కరీనా కపూర్ కూడా వచ్చింది. ఆ సమయంలో కరీనాకి హైదరాబాదీ బిర్యానితో ట్రీట్ ఇచ్చాడు. ప్రభాస్ ఇంటి నుంచి వచ్చిన భోజనం సూపర్ టేస్టీ అని కరీనా పోస్ట్ కూడా పెట్టింది.
ప్రభాస్ ఫుడ్‌లవ్ గురించి రాజమౌళి కూడా ఒకసారి చెప్పాడు. ప్రభాస్ మెనూలో వెజ్, నాన్ వెజ్, స్టార్టర్స్, డిసర్ట్స్ ఎన్ని రకాలుంటే అన్ని రకాలు కనిపిస్తాయని, వాటిల్లో ఒక్కటి మిస్ అయినా భోజనం చెయ్యడని చెప్పాడు జక్కన్న. ఈ ఇష్టంతోనే కో-స్టార్స్‌కి కూడా జంబో మీల్స్ పెడుతుంటాడు. బయటినుంచి వచ్చిన హీరోయిన్లు అయితే ఈ బాహుబలి థాళీతో ప్రేమలో పడిపోతున్నారు. ప్రభాస్‌కి ఫ్యాన్స్ అవుతున్నారు.
త్రిష 'అతడు' సినిమాలో చెప్పినట్లు ప్రభాస్ కూడా చాలా సింపుల్‌గా హీరోయిన్స్‌ని ఇంప్రెస్ చేస్తున్నాడు. డార్లింగ్ కటౌట్‌కి మామూలు అమ్మాయిలు ఫ్యాన్స్‌గా మారిపోతోంటే, ఈ హీరో తెచ్చే హోమ్ ఫుడ్‌కి హీరోయిన్లు ఫ్లాట్ అవుతున్నారు. 'సలార్' సెట్స్‌లో శ్రుతీ హాసన్‌కి హోమ్ ఫుడ్ పెట్టాడు ప్రభాస్. డార్లింగ్ ఇంటినుంచి వచ్చిన నాన్‌వెజ్ వంటలు అదిరిపోయాయని ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్ కూడా పెట్టింది శ్రుతి.
'సాహో' షూటింగ్ టైమ్‌లో శ్రద్ధా కపూర్ కూడా ప్రభాస్ హోమ్ ఫుడ్‌కి ఫిదా అయ్యింది. హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు ప్రభాస్ ఇంటినుంచి భోజనం తెప్పించేవాడని, ఆ వంటలు అద్భుతంగా ఉండేవని చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పింది శ్రద్ధా కపూర్. అంతేకాదు ప్రభాస్ అభిమానానికి ఇంప్రెస్ట్ అని స్టేట్మెంట్స్ కూడా ఇచ్చింది. యంగ్ హీరోయిన్స్‌నే కాదు, సీనియర్ హీరోయిన్‌ని కూడా ఫుడ్‌తో పడేశాడు ప్రభాస్. నాటి హీరోయిన్ భాగ్యశ్రీ, 'రాధేశ్యామ్'లో ప్రభాస్ మదర్‌గా నటించింది. ఒకసారి ఈ మూవీ సెట్స్‌లో భాగ్యశ్రీ పూతరేకులని చాలా ఇష్టంగా తిందట. ఇక ఆ తర్వాతి షెడ్యూల్‌కి బాక్సుల కొద్ది పూతరేకులు తెప్పించి భాగ్యశ్రీకి ఇచ్చాడట ప్రభాస్. దీంతో డార్లింగ్ చాలా స్వీట్ అని కాంప్లిమెంట్స్ ఇచ్చింది భాగ్యశ్రీ. ఇక ఈ కాంప్లిమెంట్లు, పోస్టులు చూసి ప్రభాస్ ఫుడ్‌తో హీరోయిన్స్‌ని పడేస్తున్నాడని కామెంట్లు పెడుతున్నారునెటిజన్లు.