ఆ ఒక్కటి వద్దు అంటోన్న సొట్టబుగ్గల సుందరి..!

NAGARJUNA NAKKA
హీరోయిన్లు గ్లామర్‌గా కనిపిస్తేనే అవకాశాలు వస్తాయని ఇండస్ట్రీలో ఒక ఒపీనియన్‌ ఉంది. యూత్‌కి కనెక్ట్‌ కావడానికి బోల్డ్‌ రోల్స్‌ చేయాలంటారు. కానీ తాప్సీ మాత్రం నో గ్లామర్‌ రోల్స్ అంటోంది. కెరీర్‌ బిగినింగ్‌లో స్కిన్‌షో చేసినా ఇప్పుడు మాత్రం నో ఎక్స్‌పోజింగ్‌ అని చెబుతోంది. మరి తాప్సీ ఈ డెసిషన్‌ తీసుకోవడానికి స్సెషల్‌ రీజన్ ఏమైనా ఉందా అనే సందేహాలు తలెత్తుతు్ననాయి.

తాప్సీకి సొట్ట బుగ్గల సుందరి అనే పేరు ఉంది. దక్షిణాదిన గ్లామర్‌ హీరోయిన్‌ ఇమేజ్ కూడా ఉంది. అయితే ఉత్తరాదిన మాత్రం తాప్సీ ఎక్కువగా స్ట్రాంగ్  రోల్స్‌లోనే కనిపించింది. 'ముల్క్, బద్‌లా, తప్పడ్' లాంటి సీరియస్‌ స్టోరీస్‌తో సెపరేట్‌ ఇమేజ్ తెచ్చుకుంది. అలాగే బాలీవుడ్‌లో తాప్సీ స్పెషల్‌ అనే కాంప్లిమెంట్స్‌ కూడా వచ్చాయి. ఈ పేరుని చెడగొట్టుకోకూడదని గ్లామర్ రోల్స్‌కి దూరంగా ఉండాలనుకుంటోందట తాప్సీ.

తాప్సీ సినిమాల్లోనే కాదు, సోషల్‌ మీడియాలోనూ బికినీ ఫోటోలు పోస్ట్‌ చెయ్యనని చెప్పేస్తోంది. ఎందుకంటే 'జుడ్వా2'లో తాప్సీ బికినీ వేసినా సినిమా ఆడలేదు. పెద్దగా పేరు కూడా రాలేదు. కానీ 'తప్పడ్' లాంటి సీరియస్‌ సబ్జెక్ట్స్‌తో బోల్దన్ని కాంప్లిమెంట్స్‌ వచ్చాయి. అందుకే పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్‌ రోల్స్‌కే ఓకే చెప్తోంది తాప్సీ.

తాప్సీ ప్రస్తుతం ఏడు సినిమాలతో బిజీగా ఉంది. హిందీలో అనురాగ్ కశ్యప్‌తో 'దొబారా' సినిమాతో పాటు హైదరాబాదీ క్రికెటర్‌ మిథాలీరాజ్‌ బయోపిక్‌ 'షబాష్ మీథూ' చేస్తోంది. అలాగే 'బ్లర్, ఓ లడఖీ హే కహా' సినిమాల్లో నటిస్తోంది. వీటితోపాటు తమిళ్ లో రెండు సినిమాలు, తెలుగులో 'మిషన్ ఇంపాజిబుల్' చేస్తోంది తాప్సీ. ఈ సినిమాలన్నీ హీరోయిన్‌ సెంట్రిక్‌గానే తెరకెక్కుతున్నాయి.


మొత్తానికి సొట్టబుగ్గల సుందరి తాప్సీ గట్టి నిర్ణయమే తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్స్ పోజింగ్ చేయనంటోంది. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందోనని అక్కడి సినీజనాలు అయోమయంలో పడ్డారు. చూద్దాం.. తాప్సీ.. ఇదే నిర్ణయాన్ని కంటిన్యూ చేస్తుందా.. లేక మధ్యలో మనసు మార్చుకుంటుందో.







మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: