'మా అమ్మకు రెండో పెళ్లి చేస్తా'.. సురేఖ వాణి కూతురు షాకింగ్ కామెంట్స్..!

Anilkumar
సినీ రంగంలో చాలామంది నటేమణులు తమ భర్తలతో విడిపోయి ఒంటరిగానే ఉండడం మనం చూస్తూఉంటాం.ఇక  ఇందులో చాలామంది తమ పిల్లలతో కలిసి జీవిస్తున్నారు.ఇక  భర్తతో విడాకులు తీసకుని పిల్లల భవిష్యత్‌ను చూసుకుంటున్నారు. తాజాగా  మొన్న సింగర్ సునీత పెండ్లి అయిన తర్వాత ఇలాంటి వారి గురించి వార్తలు రావడం స్టార్ట్ అయ్యాయి. అయితే వారు కూడా రెండో పెండ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్లు వచ్చాయి.ఇకపోతే భర్త చనిపోవడంతో కూతురు సుప్రితతో కలిసి జీవిస్తోంది నటి సురేఖ వాణి. కాగా ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా అందరికీ చాలా సుపరిచితురాలు.

అంతేకాదు  ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసిన సురేఖ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం బాధలు పడుతోంది. అంతేకాకుండా ఇప్పటికీ గ్లామర్‌ను మెయింటేన్ చేస్తోంది. కాగా ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఘాటు ఫొటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. ఇటీవల ఈమె రెండో పెండ్లి చేసుకుంటుందనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి.తాజాగా ఈ నేపథ్యంలో ఆమె కూతురు సుప్రిత తాజాగా తల్లి పెండ్లి విషయం మీద స్పందించింది.అయితే తన తల్లికి కచ్చితంగా రెండో పెండ్లి చేయాలనే ఆలోచన తనకు ఉందని, అందుకోసమే ప్రయత్నిస్తున్నానని వివరించింది. 

ఇక ఈ విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పుకొచ్చింది. దీనితో ఈ పెండ్లి విషయంలో తనది తుది నిర్ణయం కాదని, తన తల్లికే ఆ నిర్ణయాన్ని వదిలిపెట్టినట్టు చెప్పుకొచ్చింది.అయితే తనకు మాత్రం తన తల్లికి రెండో పెండ్లి చేయాలనే తాపత్రయం ఉందని, తన తల్లిని సంతోషంగా చూడాలన్నదే తన కోరిక అని వివరించింది. ఇకపోతే తన తల్లికి పెండ్లి చేస్తేనే బాగుంటుందని ఎప్పటి నుంచో అనుకుంటున్నట్టు తన మనసులోని మాటలను బయట పెట్టేసింది. అంతేకాకుండా తన తండ్రి చనిపోయాక తల్లి మీద ఎన్నో పుకార్లు పుట్టించారని చెప్పుకుని బాధ పడింది.అటువంటి బాధ నుంచి బయట పడుతుందని తన తల్లిని పార్టీలకు తీసుకెళ్తుంటే చాలా అవమానకరమైన కామెంట్లు చేశారని వాటి వల్ల తాము ఎన్నో ఇబ్బందులు పడ్డామని చెప్పుకొచ్చింది సుప్రీత..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: