రాధే శ్యామ్ పై అంచనాలు పెట్టుకోవద్దా!!

P.Nishanth Kumar
ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ చిత్రం మార్చి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రేమ కథ సినిమాగా వస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్ ఆస్ట్రాలజర్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం యొక్క అప్ డేట్స్ ప్రేక్షకులలో అంచనాలను పెంచింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందించాడు. నేపథ్య సంగీతాన్ని టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ అందిస్తూ ఉండడం విశేషం. 

ఇప్పటికే విడుదలై సూపర్ హిట్ కొట్టాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ ఇప్పుడు విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో ఈ చిత్రం నిర్మాతలు చేస్తున్న కామెంట్లు అందరిలో కొంత టెన్షన్ వాతావరణాన్ని నెలకొనేలా చేస్తుంది. ఈ చిత్ర నిర్మాణ సంస్థ యూవీ ప్రోడక్షన్స్ అధినేతలు ఒక సందర్భంలో చిత్రం యాక్షన్ ఓరియంటెడ్ సినిమా కాదని ప్రభాస్ సినిమాల రేంజ్ లో ఆసనాలు పెట్టుకోవద్దని ఇది ఒక ప్రేమకథ అని చెప్పడం జరిగింది.

ఈ నేపథ్యంలో ప్రభాస్ పాన్ ఇండియా హీరో కావడంతో వారు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం తప్పుగా వర్ణిస్తున్నారు ప్రభాస్ అభిమానులు. పాన్ ఇండియా స్టార్ హీరో సినిమా అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. అది ఎలాంటి సినిమా అయినా సరే తప్పకుండా ఆ సినిమా ప్రేక్షకులు చూడాలని కోరుకుంటారు. అలాంటిది ముందే వారికి చూడవద్దు అనే విధంగా హింట్ ఇచ్చి ఇలా చేయడం తప్పు అని చెబుతున్నారు. మరి మార్చి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎంతటి స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ప్రభాస్ చాలా రోజుల తర్వాత చేసిన సినిమా కావడంతో ఈ సినిమా కోసం కొండంత ఆశలతో చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: