ప్రస్తుతం యువ హీరోలు ఎంతో వెరైటీగా ఆలోచిస్తూ ప్రేక్షకుల ముందుకు సరికొత్త కాన్సెప్ట్ ఉన్న సినిమాలను తీసుకువస్తున్నారు. అలా ఇప్పుడు యువ హీరోలకు ఎక్కువ శాతం హిట్స్ వస్తున్నాయని చెప్పవచ్చు. వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్న కథానాయకుడు వరుణ్ తేజ్ ఈ కోవకే చెందుతారు. ఆయన గత నాలుగైద సినిమాలను పరిశీలిస్తే ఆయా చిత్రాలు ఆయనకు సూపర్ హిట్ లు తెచ్చి పెడుతూనే ఉన్నాయి.
అలా ఇతర హీరోయిన్ ల కంటే భిన్నంగా ఆలోచిస్తూ వరుణ్ ఇప్పుడు చేస్తున్న చేయబోయే సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రస్తుతం. ఈ నేపథ్యంలో బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కిన గని అనే చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంచాడు. ఇదే సమయంలో ఈ సినిమాకు పూర్తి వ్యతిరేకమైన నేపథ్యంలో కామెడీ జోనర్లో వరుణ్ ఎఫ్ 3 అనే మరో వినూత్నమైన సినిమాను దాదాపుగా పూర్తి చేశాడు. ఈ చిత్రం కూడా ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఓ స్టార్ హీరో నటించిన సినిమాలు అతి తక్కువ సమయంలోనే విడుదల కాబోతున్న డంతో ప్రేక్షకులలో కొంత సంతోషం నెలకొంది.
ఇక ఈ సినిమా తరువాత వరుణ్ తేజ్ చేయబోయే సినిమాల గురించిన వార్తలు ఇప్పుడప్పుడే బయటకు వస్తున్నాయి. ఇప్పటివరకు ఆయన చేసే తదుపరి చిత్రం అధికారికంగా ప్రకటించబడలేదు కానీ చూడబోతే ఆయన తన తదుపరి చిత్రాన్ని పెద్ద దర్శకులతో పనిచేసే విధంగా ముందుకు వెళుతున్నాడు అని తెలుస్తుంది. అంతేకాదు వెరైటీ జోనర్ లో మాత్రమే సినిమాలు చేయడానికి మొగ్గు చూపుతున్న ఈ రోజులలో విభిన్నమైన సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించాలని వరుణ్ ఇప్పుడు మంచి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏదేమైనా మెగా హీరోలలో కొంత డిఫరెంట్ గా ఆలోచించే హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది వరుణ్ తేజ్ అనే చెప్పాలి. నాగబాబు తనయుడిగా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయనపై సముద్ర తప్పకుండా ఉంటుంది. దాని నుంచి బయటపడటానికి ఆయన ఈ విధమైన ప్రయత్నాలు చేస్తున్నాడు అని అనేవారూ లేకపోలేదు.