కే జి ఎఫ్.. సినిమా నుండి ట్రైలర్ సిద్ధం.. మరి ఎప్పుడంటే..!!

Divya
 కన్నడ సినిమా పరిశ్రమలో ఎక్కువగా ఎదురుచూస్తున్న సినిమాలో కే జి ఎఫ్ -2 కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఈ సినిమా మొదటి భాగం విడుదలై ఎంత ఘన విజయాన్ని అందుకుంది మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. అందుచేతనే ఈ సినిమా సీక్వెల్ పై గత మూడు సంవత్సరాల నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 14న భారీగా విడుదలకు సిద్ధమైన ట్లుగా చిత్రబృందం అధికారికంగా తెలియజేయడం జరిగింది.. ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడే కొద్దీ.. ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఇక ఈ సినిమాకు సంబంధించి ఇదివరకే హీరోయిన్ తో పాటకు మరికొంత మంది నటీనటులు డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేసుకున్నారు. హీరో కూడా ఈ నెలలో డబ్బింగ్ పనులు పూర్తి చేయనున్నట్లు సమాచారం. దీంతో ఇక సినిమా ప్రమోషన్ లను చిత్రబృందం మొదలుపెట్టడం జరిగిందట. అయితే ఇలాంటి సమయంలోనే కే జి ఎఫ్ -2 సినిమాలు ఒక పాటను విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే తాజాగా హంబుల్ ఫిలిమ్ వారు బస ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.. ఈ సినిమా కోసం మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదా.. మీరు చూస్తున్న అటువంటి ఎదురు చూపులకు ఒక ప్రతిఫలం ఉంటుందని చిత్ర బృందం హామీ ఇస్తోంది అంటూ తెలియజేశారు.

అందుకోసం ఒక పోల్ ను నిర్వహించడం కూడా జరిగిందట.. అభిమానుల కోసం ఈ సినిమా నుంచి ట్రైలర్ , పాట కావాలా అనే ఒక పోల్ ను నిర్వహించడం జరిగిందట. అయితే ఈ ఫోల్ లో 82% మంది టైలర్ కావాలని ఓటింగ్ వేశారు. ఇక మిగిలిన 18 శాతం మంది ఏదో ఒకటి అప్డేట్ ఇవ్వాలని సూచించారు. దీంతో చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: