సమంత సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న ఒకప్పటి బాలనటి..?

Anilkumar
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ లు ఇప్పుడు తిరిగి మళ్ళీ ఇండస్ర్టీలోకి రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి మాత్రం అగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించడం కోసం అలనాటి సీనియర్ హీరోయిన్లు ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది సీనియర్ హీరోయిన్లు పలు సినిమాల ద్వారా రీ ఎంట్రీ ఇస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి అవకాశాలతో ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే 'సిరివెన్నెల' సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇచ్చి ..ఆ తర్వాత '420' అనే సినిమాతో హీరోయిన్ గా మారి ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మధురిమ.. 

ఇప్పుడు మరోసారి ఇండస్ట్రీ లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అలనాటి సినీ నటి మధురిమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'ఒరేయ్ రిక్షా: సినిమాలో నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా అనే పాట ద్వారా ప్రతి ఒక్కరికి సుపరిచితమైన ఈ హీరోయిన్ ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. అంతేకాదు భరత నాట్య కళాకారిణిగా దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు చేసి ఎంతో మంది ప్రశంసలు, అవార్డులను అందుకుంది. హీరోయిన్ తో పాటు నాట్యకారిణి గా, దర్శకురాలిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మధురిమా ఇప్పుడు మరోసారి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది.

తాజా సమాచారం ప్రకారం సౌత్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న లేటెస్ట్ లేడీ ఓరియంటెడ్ మూవీ 'యశోద' సినిమాతో సీనియర్ నటి మధురిమ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించడం కోసం ఇటీవల ఆమెను సంప్రదించినట్లు సమాచారం. అయితే సినిమాలో ఆమె పాత్ర నచ్చి మధురిమ కూడా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక సమంత సినిమాతో మధురిమ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వడంతో ఆమె అభిమానులు సైతం ఈ సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక యశోద సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంకప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: