మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరువాత వరుస సినిమాల్లో తెగ నటిస్తున్నారు. ఆయన లైనప్ చూస్తే యంగ్ హీరోలు కూడా షాక్ అవ్వాల్సిందే మరి. గ్యాప్ లేకుండా ఆయన సినిమాల్లో నటిస్తున్నారు.
ప్రస్తుతం ఆయన నటించిన 'ఆచార్య' సినిమా ఏప్రిల 29న రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. మరోపక్క మలయాళ సినిమా 'లూసిఫర్' రీమేక్ లో కూడా నటిస్తున్నారు చిరు. మోహన్ రాజా డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి 'గాడ్ ఫాదర్' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.
దీంతో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇందులో చిరుకి జోడీగా తమన్నా మరియు సిస్టర్ క్యారెక్టర్ లో కీర్తి సురేష్ కనిపించనుందన్న విషయం తెలిసిందే.. ఈ సినిమాలతో పాటు మరో రెండు సినిమాలు కూడా కమిట్ అయ్యారు మెగాస్టార్. అందులో ఒకటి బాబీ డైరెక్షన్ లో మరొకటి వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కనున్నాయట.అయితే ఇప్పుడు మరో ప్రాజెక్ట్ ఓకే చేశారట చిరు.
సుకుమార్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్నట్లు సమాచారం.. ఈ విషయాన్ని సుకుమార్ అఫీషియల్ గా వెల్లడించారట. దీనికి సంబంధించిన ఓ ఫొటో కూడా ఆయన షేర్ చేశారు. త్వరలోనే చిరుని డైరెక్ట్ చేయబోతున్నట్లు ఆయన చెప్పారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధుల్లేకుండా పోయాయి. సుకుమార్ దర్శకత్వంలో మెగాస్టార్ అంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. వీరి కాంబినేషన్ లో వస్తున్నది సినిమా అయితే కాదట. ఓ కమర్షియల్ యాడ్ అని సమాచారం.. దానికోసం సుకుమార్.. చిరుని కలిశారని త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందని తెలుస్తుంది.. చిరు యాడ్స్ లో కనిపించి కూడా చాలా కాలమవుతుంది. ఇప్పుడు మళ్లీ కమర్షియల్ యాడ్స్ లో నటించడానికి ఆయన రెడీ అవుతున్నారు. మొత్తానికి ఓ పక్క సినిమాలు అలాగే మరోపక్క యాడ్స్ తో బిజీగా మారనున్నారట మెగాస్టార్.