ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ క్రేజ్ ఏ రేంజిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్ లో పెరిగిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు దాదాపుగా ఎక్కువ శాతం పాన్ ఇండియా సినిమాల వైపు ఇంట్రెస్టు చూపిస్తున్నారు, దాదాపు టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోలు తమ సినిమాలను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఇది ఇలా ఉంటే రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో కూడా పాన్ ఇండియా సినిమా తెరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే, ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా కొన్ని రోజుల క్రితమే జరిగిపోయింది.
అయితే ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకరికిస్తూ ఉండడంతో ఫుల్ క్రేజ్ వున్న హీరోయిన్ ను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది, అయితే అందులో భాగంగా రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉన్న పరిణితి చోప్రా ను హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది, ఇప్పటివరకు ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న కియారా అద్వానీ, శ్రద్ధా కపూర్, ఆలియా భట్ లాంటి ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ లు కూడా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ సినిమాల్లో నటించడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం కియారా అద్వానీ, రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది, అలాగే బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అలియా భట్ 'ఆర్ఆర్ఆర్' సినిమాల్లో నటించింది.